Power Star: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన సినిమా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, యావరేజ్, అట్టర్ ప్లాప్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. పవన్ కల్యాణ్ ప్లాపు సినిమాలు కూడా 50కోట్లు కలెక్ట్ చేస్తుందంటే బాక్సాఫీస్ వద్ద అతడి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమా కథతో సంబంధం లేకుండా పవన్ కటౌట్ చూడటానికే థియేటర్లకు వచ్చే అభిమానులు ఆయనకు కోట్లల్లో ఉన్నారు.
పవన్ కల్యాణ్ ఇప్పటివరకు కేవలం 25కు పైగా మాత్రమే నటించారు. ఏడాదిలో ఆయన నటించిన రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇక పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చాక మాత్రం జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ ముందుకెళుతున్నాడు. ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న పవన్ కల్యాణ్ ‘బీమ్లానాయక్’, ‘హరిహరవీరమల్లు’ సినిమాలను వరుసగా లైన్లో పెట్టాడు.
Also Read: భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?
మరోవైపు పవన్ కల్యాణ్ కెరీర్లో పలు సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. వీటిలో చాలావరకు సూపర్ హిట్ కాంబినేషన్ ఉండటం విశేషం. అలాంటి వాటిలో సత్యగ్రహి, దేశి, ప్రిన్స్ ఆఫ్ పీస్, కోబాలి వంటి సినిమాలున్నాయి. దేశభక్తి నేపథ్యంలో ‘సత్యగ్రహి’ మూవీని పవన్ కల్యాణ్ స్వయంగా తెరకెక్కించాలని భావించాడు. అయితే తాను దర్శకత్వం చేసిన ‘జానీ’ అట్టర్ ప్లాప్ కావడంతో ‘సత్యగ్రహి’కి దర్శకత్వం చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు. ఇప్పటికి కూడా ‘సత్యగ్రహి’ టైటిల్ పవన్ పేరిట రిజిస్టర్ అయి ఉంది.
పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘కోబలి’ అనే సోషియో ఫాంటసీ మూవీ రావాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ మధ్యలోనే ఈ మూవీ పక్కకు వెళ్లిపోయింది. ఇక పవన్ కల్యాణ్ వదులుకున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ ‘నువ్వే కావాలి’. ఈ సినిమా కథను దర్శకుడు విజయ్ భాస్కర్ పవన్ కల్యాణ్ తోనే తెరకెక్కించాలని భావించారు. పవన్ కూడా ఓకే అన్నారట. అయితే సడెన్ గా పవన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో తరుణ్, రిచా హీరోరోయిన్స్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ‘దేశీ’లో పవన్ నటించాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా పవన్ హీరోగా సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్ లో ‘ప్రిన్స్ ఆఫ్ స్పిచ్’ మూవీ స్టార్ట్ అయింది. ఈ సినిమా కూడా మధ్యలోనే నిలిచిపోయింది.
Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?