https://oktelugu.com/

మరోసారి ‘‘మహా’’ విజృంభణ

సరిగ్గా ఏడాది క్రితం దేశంలోకి అడుగుపెట్టిన కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టించింది. ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది. లాక్ డౌన్ తో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఎందరరో జీవితాలను రోడ్డు పడేసింది. కొద్దిరోజుల తరువాత వైరస్ ప్రభావం తగ్గగా.. ఇక దాని పీడ విరగడైనట్లేనని అంతా అనుకున్నారు. కరోనాతో ఇక భయం పోయిందని సంతోషపడ్డారు. ఈ క్రమంలో సరిగ్గా ఏడాది తరువాత మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. గతేడాది ఎక్కడైతే తన ప్రభావాన్ని చూపిందో మళ్లీ అక్కడి […]

Written By: , Updated On : March 25, 2021 / 12:13 PM IST
Follow us on

Corona Cases
సరిగ్గా ఏడాది క్రితం దేశంలోకి అడుగుపెట్టిన కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టించింది. ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది. లాక్ డౌన్ తో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఎందరరో జీవితాలను రోడ్డు పడేసింది. కొద్దిరోజుల తరువాత వైరస్ ప్రభావం తగ్గగా.. ఇక దాని పీడ విరగడైనట్లేనని అంతా అనుకున్నారు. కరోనాతో ఇక భయం పోయిందని సంతోషపడ్డారు. ఈ క్రమంలో సరిగ్గా ఏడాది తరువాత మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. గతేడాది ఎక్కడైతే తన ప్రభావాన్ని చూపిందో మళ్లీ అక్కడి నుంచే విస్తరణకు దారులు వేస్తోంది.

మొన్నటి వరకు పెద్దగా ప్రభావం చూపని వైరస్ తాజాగా చెలరేగిపోతోంది. అంతకంతకూ పెరిగిపోతున్న వైరస్ వ్యాప్తి ప్రజలను ఆందోనళకు గురిచేస్తోంది. కేసుల నమోదు సంఖ్యకూడా వేలల్లో పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తికి కొత్త స్ర్టేయిన్లు కారణంగా చెబుతున్నారు. దీంతో పదునెక్కిన వైరస్ మరింత బలోపేతం కావడంతో కేసుల నమోదు భారీగా పెరిగిపోతోంది. తాజాగా దేశంలో 52వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. అందులో రెండు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల వ్యవధిలో నమోదైన కేసుల్లో మూడోంతులు రెండు రాష్ట్రాల్లోనే నమోదు కావడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పినా.. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. మహారాష్ట్రలో రోజు వ్యవధిలో 31,855 కేసులు నమోదు కావడం గమనార్హం. అంటే దేశంలో నమోదు అయిన కేసుల్లో సగానికన్నా ఎక్కువ అక్కడే ఉండడం సరిహద్దు రాష్ట్రాలకు ఆందోళన కలిగించే పరిణామం. ఆ రాష్ర్టంలో దాదాపు ఆరు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అంచనా.

మహారాష్ర్టలోని తొమ్మిది జిల్లాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పూణె, నాగపూర్, ముంబయి, థానే, నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్, జల్ గావ్, అకోలా జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరోవైపు పంజాబ్ లోనూ పరిస్థితి బాగోలేదని అధికారులు చెబుతున్నారు. ఆ రాష్ట్ర జనాభాకు.. అక్కడ నమోదు అవుతున్న కేసులకు సంబంధం ఉండడం లేదని.. తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం స్పష్టం అవుతుందని చెబుతున్నారు. తాజాగా వెలుగుచూస్తున్న లెక్కల ప్రకారం.. దేశంలో నమోదు అయిన కొత్త కేసుల్లో మహారాష్ట్ర, పంజాబ్ రెండు చోట్లలో మూడొంతుల కేసులు నమోదుకావడం గమనార్హం.