Corona 4th Wave: కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మూడు దశల్లో ప్రజలను ముప్పుతిప్పల పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కరోనా నాలుగో దశ వస్తుందా అనే ఆందోళనలో ప్రజలు నిరంతరం భయపడుతున్నారు. మరోవైపు చైనాలో వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ చైనా మాత్రం వాటిని కరోనా మరణాలుగా పేర్కొనడం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు చైనా అన్ని రహస్యంగానే ఉంచుతోంది. దీంతో ప్రపంచ మానవాళి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అక్కడ కరోనా ఆంక్షలు వద్దంటూ ప్రజలు గోల చేయడంతో నిబంధనలు సడలించినందున చైనాకు భారీ నష్టమే ఎదురవుతోంది.
ఈ నేపథ్యంలో కరోనా నాలుగో దశ వస్తుందనే బెంగ ప్రజలను పట్టుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్ 7 అత్యంత వేగంగా విస్తరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. గతంలో కరోనా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునేది. ఇప్పుడు ఒక మనిషి నుంచి మొత్తం కాలనీకే అంటుకునే ప్రమాదం ఉందని తెలియజేస్తోంది.
అందరు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. కొత్త వేరియంట్ విస్తరణ వేగంగా జరుగుతున్నందున ప్రజలు నిరంతరం జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. ఒకవేళ కరోనా సోకితే అంతే సంగతి దాని వేగాన్ని మనం అందుకోలేం. సాధ్యమైనంత వరకు నియంత్రణే సరైన మార్గం. దీని కోసం అందరు విధిగా నడుచుకోవాలి. కరోనాను దాదాపుగా మరిచిపోతున్న సందర్భంలో ఇప్పుడు కొత్త వేరియంట్ గా రూపాంతరం చెంది జనాలను భయాందోళనలకు గురిచేస్తున్న వైరస్ ను కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది.
మూడు దశల్లో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వైరస్ ప్రస్తుతం ఒమిక్రాన్ ఎఫ్ బీ 7 గా మారి ప్రజలను ఎన్నో వేదనలకు గురిచేస్తోంది. చైనా, జపాన్, అమెరికా లాంటి దేశాల్లో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. వేగంగా వ్యాపించినా మునుపటి తీవ్రత మాత్రం వైరస్ లో లేదని వైద్యులు చెబుతున్నా మన జాగ్రత్తల్లో మనం ఉంటే ముప్పు రాకుండా చూసుకోవచ్చు. ఒమిక్రాన్ వేరియంట్ ను దేశంలోకి రాకుండా చేయడానికే మనం తాపత్రయ పడాల్సిన అవసరం ఏర్పడింది.