spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh- Trivikram Movie: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి... మహేష్ కథ పూర్తిగా మార్చేశారట!

Mahesh- Trivikram Movie: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి… మహేష్ కథ పూర్తిగా మార్చేశారట!

Mahesh- Trivikram Movie: మహేష్-త్రివిక్రమ్ మూవీపై రోజుకో పుకారు షికారు చేస్తుంది. తాజాగా ఈ చిత్ర కథ పూర్తిగా మార్చేశారని, మొదట అనుకున్నది వేరు ఇప్పుడు చేస్తున్నది వేరు అంటున్నారు. ఎస్ఎస్ఎంబి 28 అధికారికంగా ప్రకటించి చాలా కాలమే అవుతుంది. త్రివిక్రమ్ చివరి చిత్రం అల వైకుంఠపురంలో 2020 సంక్రాంతికి విడుదలైంది. ఆ మూడేళ్ళలో ఆయన నుండి మరో మూవీ రాలేదు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ 30 డైరెక్ట్ చేయాల్సింది. కారణం తెలియదు కానీ త్రివిక్రమ్ ని ఎన్టీఆర్ పక్కన పెట్టి కొరటాలకు అవకాశం ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ మహేష్ తో మూవీని సెట్ చేసుకున్నాడు.

Mahesh- Trivikram Movie
Mahesh- Trivikram

ఇక సర్కారు వారి పాట 2022 మే లో విడుదలైంది. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎస్ఎస్ఎంబి 28 ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్ర బాధ్యతలు తీసుకోవడం కూడా ఒక కారణం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడు సాగర్ కే చంద్రతో దగ్గరుండి సినిమా తెరకెక్కించారు.

ఎట్టకేలకు ఇటీవల మహేష్ మూవీ షూట్ ని త్రివిక్రమ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరణ జరిపారు. అయితే షూటింగ్ కూడా మొదలయ్యాక కథలో మార్పులు చేశారనే టాక్ వినిపించింది. దీంతో ఫస్ట్ షెడ్యూల్ అనుకున్న ప్రకారం పూర్తి చేయలేదట. మధ్యలో ఆపేశారట. అలాగే ఈ చిత్ర షూట్ మొదలయ్యాక మహేష్ కుటుంబంలో రెండు మరణాలు సంభవించాయి. సెప్టెంబర్ అమ్మ, నవంబర్ లో మహేష్ నాన్నగారు చనిపోయారు.

Mahesh- Trivikram Movie
Mahesh- Trivikram Movie

తాజా సమాచారం ఏమిటంటే మొదట్లో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ మూవీ తెరకెక్కించాలనుకున్నారట. ఇప్పుడు దాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చేశారట. ఫ్యామిలీ ఎమోషన్స్ ఒడిసిపట్టి వెండితెరపై అద్భుతం చేయడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఉన్న అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని చెప్పొచ్చు. మహేష్ తో ఆయన చేసే కథ ఆ తరహాలోనే ఉంటుందట. బంధువుల మధ్య ఇగోలు, అపార్ధాలతో వచ్చే గొడవలు ఆధారంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కి కొంత యాక్షన్ జోడించి తెరకెక్కించనున్నారని టాక్. ప్రస్తుతం మహేష్ స్విట్జర్లాండ్ టూర్ లో ఉన్నారు. రాగానే వచ్చే ఏడాది ఆయనపై లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version