HomeజాతీయంCongress Second List: కాంగ్రెస్‌ రెండో లిస్ట్‌ రిలీజ్‌.. తెలంగాణలో ఐదుగురికి ఛాన్స్‌..

Congress Second List: కాంగ్రెస్‌ రెండో లిస్ట్‌ రిలీజ్‌.. తెలంగాణలో ఐదుగురికి ఛాన్స్‌..

Congress Second List: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. అధికార బీజేపీ ఇప్పటికే 80 శాతం సీట్లను ప్రకటించింది. మిగతా సీట్లను కూడా త్వరగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా స్పీడ్‌ పెంచింది. అభ్యర్థులను త్వరగా ప్రకటించి ప్రచారంలోకి దిగాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 50 మందితో రెండు లిస్టు రిలీజ్‌ చేసింది.

తెలంగాణలో ఐదుగురికి..
తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి ఛాన్స్‌ దక్కింది. పెద్దపల్లి(ఎస్పీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి స్థానానికి సునీత మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌(ఎస్సీ) నుంచి మల్లు రవి పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది.

నలుగురు వలస నేతలే..
ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో టికెట్లు దక్కిన ఐదుగురిలో నలుగురు ఇటీవల కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం. గడ్డం వంశీకృష్ణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన తండ్రి వివేక్‌తో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పట్నం సునీతా మహేందర్‌రెడ్డి నెల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి మూడు రోజుల క్రితమే కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. నలుగురిలో ముగ్గురు బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవారే. రంజిత్‌రెడ్డి చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ, దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, సునీతారెడ్డి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌. వీరంతా బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచినవారే.

తొలి జాబితాలో నలుగురు..
ఇక కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్, నల్గొండ నుంచి కుందూర్‌ రఘువీర్, మహబూబ్‌నగర్‌ నుంచి చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌(ఎస్టీ) నుంచి బలరాం నాయక్‌ పేర్లును ప్రకటించింది. తాజాగా ఐదుగురిని ఎంపిక చేసింది. దీంతో మొత్తం 17 స్థానాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పటి వరకు 9 మందిని ఎంపిక చేసింది. మిగతా 8 మందిని కూడా త్వరగా ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకా కరీంనగర్, ఖమ్మం, మెదక్, వరంగల్, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version