Punjab CM: మద్యానికి బానిస అయితే అది సామాన్యుడైనా.. సెలబ్రెటీ అయినా అంతే.. తాగి ఊగడం.. చిక్కుల్లో పడడం ఖాయం. గత నెలలో పంజాబ్ సీఎంగా గద్దెనెక్కిన భగవత్ మాన్ సింగ్ సైతం తాజాగా ఈ ‘మద్యం’ వివాదంలో చిక్కుకున్నాడు. బీజేపీ నేత తజీందర్ సింగ్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఇక్కడ ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీనికి కాదని ఇక్కడి ప్రజలు ఆప్ ను అవకాశం ఇచ్చారు. అయితే సీఎం పీటమెక్కిన భగవత్ మాన్ సింగ్ తాజాగా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సీఎం ఎలాంటి వివాదంలో చిక్కకున్నారు..? ఆయన చేసిన తప్పేంటి..? పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారు..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

సామాన్యుడి బంధువు పార్టీగా చెప్పుకునే ఆప్ ఢిల్లీతో పాటు పంజాబ్ లోనూ పాగా వేసింది. అయితే ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ సిక్కు మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ స్వర్ణ దేవాలయం విషయంలో ఓ తప్పు చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయన ఇటీవల స్వర్ణ దేవాలయానికి మద్యం తాగి వెళ్లాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 14న సీఎం భగవత్ మాన్ సింగ్ మద్యం తాగి స్వర్ణ దేవాలయంలోకి వెళ్లాడని అంటున్నారు. దేశ వ్యాప్తంగా జరుపుకునే బైసాఖీ సందర్భంగా సీఎం మద్యం సేవించి తఖ్త్ దమ్ దామా సాహిబ్ లోకి ప్రవేశించినట్లు ఫిర్యాదు అందిందన్నారు.
బీజేపీ నేత తజీందర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సీఎం క్షమాపణలు చెప్పాలని శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా బీజేపీ నేత బగ్గీ ట్విట్టర్ వేదికగా సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఎం భగవత్ మాన్ సింగ్ తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడుతాడు. నిత్యం నిషాలో జోగుతూ మాన్ బఫూన్ వేశాలెస్తాడు.’ అని ఎన్నికల ప్రచారంలో కొందరు ఇలా ఆరోపించారు. అయితే ఇప్పుడు కొందరు ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఇక పార్లమెంట్ కు సైతం భగవత్ మాన్ సింగ్ మద్యం సేవించి వస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. గతంలోనే భగవత్ మాన్ సింగ్ పై చాలా ఆరోపణలున్నాయి. అయితే రెండేళ్ల కిందట బర్నాలో జరిగిన ఒక ర్యాలీలో ఇప్పటి నుంచి మద్యం జోలికి వెళ్లలని ప్రజలందరి మధ్య ప్రమాణం చేశారు. ఇక నుంచి తాగి ఎలాంటి పనులు చేయనని చెప్పారు. కానీ ఇప్పుడు సిక్కుల ఆరాధ్య దైవంగా భావించే గురుద్వార్లోకే మద్యం తాగి వెళ్లాడని ఆరోపణలు వస్తున్నాయి. అయితే భగవత్ మాన్ సింగ్ కూడా సిక్కు మతానికి చెందిన వారు కాబట్టి ఏం జరగలేదు.. మిగతా వారైతే పరిస్థితి వేరే ఉండేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు.