Sai Madhav Burra: రచయితగా ఆయన కెరీర్ సీరియల్ తో మొదలు అయింది. కానీ అతి తక్కువ సమయంలోనే సినిమాలకు రాసే స్టార్ రైటర్ గా ఆయన ఎదిగారు. ఆ ఎదుగుదల గురించి తన సినిమా కష్టాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ రైటర్ గా, తన హావాను నడిపిస్తున్న సాయిమాధవ్ ప్రస్తుతం భారీ చిత్రాలన్నింటికీ మాటలు రాస్తున్నారు.

కాగా బుర్రా సాయిమాధవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ జర్నీ గురించి క్లారిటీగా చెప్పుకొచ్చారు. బుర్రా సాయిమాధవ్ మాటల్లోనే.. ‘సినిమా కష్టాలు చాలా అనుభవించాను. నాకు అప్పట్లో ఇంటి నుంచి మా అమ్మ గారు వెయ్యి రూపాయలు పంపేవారు. కానీ అవి వాటిని రోజుల్లోనే ఖర్చు పెట్టేవాడిని. అలా చాలా కష్టాలు పడ్డాను. అయితే నేను ఆ కష్టాలను అడ్వెంచర్స్ గా ఫీలయ్యే వాడిని. నిజంగానే నాకు అవి మంచి అనుభవాలుగా ఉపయోగపడ్డాయి.
Also Read: తెలుగు వెండితెర మసక బారితే.. తెలుగు వారి ఆత్మగౌరవానికి మసిపూసినట్టే !
అదేంటో నేను మొదటి నుంచి ప్రతీది సినిమాలతోనే పోల్చుకుంటూ బతికేవాడిని. ఇక నాకు మొదటి అవకాశం ఇచ్చింది సీరియల్స్ డైరెక్టర్ రాజాచంద్రవర్మ గారు. ఆయనకు నా రైటింగ్ బాగా నచ్చింది. నన్ను డైలాగ్స్ రాయమన్నారు. అలా ఆయన డైరెక్ట్ చేసిన ‘అభినందన’ అనే టెలీఫిల్మ్ కి నేను మొదట రాశాను. దానికి బాగా పేరొచ్చింది. ఆ తరువాత పుత్తడిబొమ్మ సీరియల్ రాశాను. అది చూసి క్రిష్ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాకు రాసే ఛాన్స్ ఇచ్చి బాగా ప్రోత్సహించారు.
Also Read: రమేష్ బాబు-మహేష్ బాబు బంధంపై త్రిక్రవిక్రమ్ ఏమన్నాడంటే?