Chandrayaan 3 : కోట్ల మంది భారతీయుల కలలు ఫలించాయి. అగ్రరాజ్యాలకే సాధ్యం కాని చందమామను మనం అందుకున్నాం.. అందని ద్రాక్ష అయిన జాబిల్లి దక్షిణ దృవంపై భారత్ సరికొత్త చరిత్ర సృష్టించాం.. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.
చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి..
అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది. ఇక నేటి నుంచి 14 రోజుల పాట జాబిల్లిపై రోవర్ పరిశోధనలు జరపనుంది.
జులై 14న చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి దీన్ని భూకక్ష్యలోకి చేరింది. దీని కక్షను పెంచుతూ చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టి అక్కడ కక్ష తగ్గించి ఈరోజు సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని ధ్రాక్ష అది. జాబిల్లి దక్షిణ దృవంపై మన వ్యోమనౌకను దించేసి భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది.