Chandrayaan 3 : చంద్రయాన్–3 ప్రయోగం తుది దశకు చేరింది. చందమామపై ఈసాయంత్రమే విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ పేరు బయటకొచ్చింది. కూకట్‌పల్లిలోని ఎయిర్ స్పేస్ అడ్ ప్రెసిసన్ ఇంజినీర్స్ కంపెనీ భాగస్వామ్యం ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి జీఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ సహయాంతో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్‌ను తీసుకెళ్లనుంది. వీటిల్లో బ్యాటరీలను ఏర్పాటు చేసుకునే విడి భాగాలతోపాటు కొన్ని పార్ట్‌లను హైదరాబాద్‌కు చెందిన కంపెనీనే తయారుచేసింది. ఎయిర్ స్పేస్ అండ్ ప్రెసిసన్ ఇంజినీర్స్ కంపెనీ రాకెట్, ఇతర పార్ట్‌లకు సంబంధించిన విడి భాగాలను తయారుచేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ ఫౌండర్‌గా డీఎన్.రెడ్డి ఉన్నారు. కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్‌లో ఈ కంపెనీ ఉంది.
50 ఉప గ్రహాలకు విడి భాగాలు..
1998 నుంచి ఈ కంపెనీ ఎయిర్‌స్పేస్ రంగంలో విశేష సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు ఇస్రో లాంచ్ చేసిన 50 ఉపగ్రహాల కోసం ఈ కంపెనీ పలు విడి భాగాలను తయారుచేసింది. ఇప్పుడు చంద్రయాన్–3కి కూడా విడిభాగాలను అందించడంతో ఈ కంపెనీ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
భెల్..
చంద్రయాన్ 3కి సంబంధించిన బ్యాటరీలను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సరఫరా చేసింది. బీహెచ్‌ఈఎల్ యొక్క వెల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టి్టట్యూట్ చంద్రయాన్ 3 కోసం బై–మెటాలిక్ అడాప్టర్లను సరఫరా చేయడానికి కూడా బాధ్యత వహిస్తుంది. ఎంటీఆర్‌ఏ టెక్నాలజీస్: కంపెనీ చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇంజిన్లు మరియు బూస్టర్ పంపులతో సహా కీలక భాగాలను తయారు చేసింది.
గోద్రెజ్ ఏరోస్పేస్…
కంపెనీ కోర్ స్టేజ్ కోసం ఎల్110 మరియు పై స్టేజ్ కోసం సీఈ20 ఇంజిన్‌థ్రస్ట్ ఛాంబర్‌తో సహా కీలకమైన ఇంజిన్ మరియు థ్రస్టర్‌లను ఉత్పత్తి చేసింది.
అంకిత్ ఏరోస్పేస్..
కంపెనీ అల్లాయ్ స్టీల్ మరియు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫాస్టెనర్‌లను సరఫరా చేసినట్లు కంపెనీ పేర్కొంది. మిషన్ మన్నిక మరియు పనితీరును పెంపొందించడంలో కీలకమైన అల్లాయ్ స్టీల్, స్టెయిన్‌లెస్ స్టీల్ ఫాస్టెనర్‌లు మరియు ప్రత్యేకంగా రూపొందించిన టైటానియం బోల్ట్‌లను సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది.
వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్..
లాంచ్ వెహికల్, ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ ట్యాంకేజ్‌లు మరియు 200 ఫ్లెక్స్ నాజిల్ హార్డ్‌వేర్‌లో ఉపయోగించే క్రిటికల్ బూస్టర్ సెగ్మెంట్స్ 200ని సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది.
స్పేస్‌టెక్ పరిశ్రమలో 400 ప్రైవేట్ కంపెనీలు
ఒక్కమాటలో చెప్పాలంటే నాసా, రష్యా, చైనా అంతరిక్ష సంస్థలు ఇప్పటివరకు చేయలేని పని ఇస్రో చేయడానికి చాలా దగ్గరగా ఉంది. ఇస్రో ఒక్కరోజులో ఈ మైలురాయిని సాధించలేదు. దీని వెనుక దాదాపు 6 దశాబ్దాల కృషి ఉంది. ఈ 6 దశాబ్దాలలో ఇస్రో అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే కాకుండా దేశంలో కొత్త పరిశ్రమను అభివృద్ధి చేసింది. దీనిని స్పేస్‌టెక్ పరిశ్రమగా పిలుస్తారు. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఈ రంగంలో సుమారు 400 ప్రైవేట్ కంపెనీలు చురుకుగా ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇస్రో మిషన్‌లో విలువైన సహకారం అందించాయి.