Budjet 2024: బడ్జెట్ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఏయే రంగాలకు ఎంత కేటాయింపులు చేస్తుందో ముందే అంచనా వేస్తుంది. ప్రభుత్వానికి వివిధ సంస్థలు, రంగాల నుంచి వస్తున్న ఆదాయాన్ని వెల్లడిస్తుంది. గతంలో బడ్జెట్‌ను మార్చిలో ప్రవేశపెట్టేవారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని మార్చారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతన్నారు. ఈసారి కూడా మరో ఐదు రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి అందరికలోనూ ఈ బడ్జెట్‌పై భారీగా అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు.
బడ్జెట్ రకాలు..
ప్రభుత్వానికి సంబంధించిన వార్షిక ఆదాయ వ్యవయాలను బడ్జెట్ తెలియజేస్తుంది. ఇందులో పలు నిర్ణయాలను ప్రకటిస్తుంది. అయితే ఈ బడ్జెట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్తి బడ్జెట్. రెండోది ఓటాన్ బడ్జెట్. వీటిగురించి తెలుసుకుందాం.
పూర్తి స్థాయి బడ్జెట్ అంటే..
పూర్తిస్థాయి బడ్జెట్‌లో ట్యాక్స్ స్లాబ్‌లు మార్చడం, కొత్త స్కీమ్స్ ప్రకటించడం, వివిధ రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయి. పార్లమెంట్‌లో ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందడం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌లో భాగమే.
ఓటాన్ అకౌంట్ అంటే.
ఎన్నికల ఏడాదిలో మాత్రం ప్రభుత్వం పన్నులు, కొత్త స్కీమ్స్ ప్రకటన జోలికి వెళ్లవు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఖర్చుల కోసం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నికలకు వెళ్లే ప్రభుత్వం దీనిని ప్రవేశపెడుతుంది. దీనినే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదా ఇంటీరియమ్ బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్‌కు కూడా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. ఓటాన్ బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు, ప్రకటనలు ఉండవు. కొత్త స్కీమ్స్ కూడా ప్రకటించే అవకాశం ఉండదు.