ఇండియాలో కరోనా అందుకే తగ్గుముఖం పట్టిందా..?

ఒక మూడు నాలుగు నెలల క్రితం వరకు బోసిపోయిన రోడ్లు.. కళావిహీనమైన బస్టాండ్లు.. తెరుచుకోని మార్కెట్లు.. సర్వీస్‌ చేయని హోటళ్లు.. ఇదీ మన దేశ పరిస్థితి. కానీ.. ఇప్పుడు బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రైల్వే స్టేషన్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారుల మీద వాహనాల జోరు పెరిగింది. హోటళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్..సూపర్ మార్కెట్లు.. కూరగాయాల షాపులు.. రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు.. ఇలా అన్నీ తెరుచుకోగా జనాలతో కిటకిటలాడుతున్నాయి. షాపింగ్ కోసం.. ఫంక్షన్ల కోసం జనాలు వెళ్తూనే ఉన్నారు. […]

Written By: Srinivas, Updated On : January 5, 2021 12:03 pm
Follow us on


ఒక మూడు నాలుగు నెలల క్రితం వరకు బోసిపోయిన రోడ్లు.. కళావిహీనమైన బస్టాండ్లు.. తెరుచుకోని మార్కెట్లు.. సర్వీస్‌ చేయని హోటళ్లు.. ఇదీ మన దేశ పరిస్థితి. కానీ.. ఇప్పుడు బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రైల్వే స్టేషన్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారుల మీద వాహనాల జోరు పెరిగింది. హోటళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్..సూపర్ మార్కెట్లు.. కూరగాయాల షాపులు.. రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు.. ఇలా అన్నీ తెరుచుకోగా జనాలతో కిటకిటలాడుతున్నాయి. షాపింగ్ కోసం.. ఫంక్షన్ల కోసం జనాలు వెళ్తూనే ఉన్నారు.

Also Read: హీటెక్కిస్తున్న బెంగాల్‌ రాజకీయాలు

అయితే.. ఇంకో వైపు కరోనా టెన్షన్‌ ఇంకా పోనే లేదు. కానీ ప్రజలు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నారు. ఈ వేళ కరోనా కేసుల జోరు మరింత పెరగాలి. కానీ.. అందుకు భిన్నంగా పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. ఒక గుడ్‌న్యూస్‌ లాంటిదే. అయితే.. ఇందుకు కారణాలు ఏమిటనేది వేల డాలర్ల ప్రశ్న. ఒకప్పుడు వేగవంతంగా పెరిగిన కేసులతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. రోజుకు లక్షకు దగ్గరగా కేసులు వచ్చాయి. దీంతో.. రానున్న రోజులు మరెంత దారుణంగా ఉంటాయన్నది అందరిలోనూ భయం కనిపించింది.

ఇప్పుడు కేసులు భారీగా తగ్గిపోయాయి. జనవరి నాలుగున విడుదలైన బులెటిన్ ప్రకారం దేశంలో నమోదైన కేసులు 16,504 మాత్రమే. ఒకప్పుడు 97 వేలు నమోదైతే ఇప్పుడు 16వేలు అంతే. వాస్తవానికి ఇప్పుడు నడుస్తున్నది చలికాలం. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కూడా కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగేలా చేసే పరిస్థితి.ఇలాంటి వేళ తక్కువ కేసులు నమోదు కావటం అంటే.. కచ్ఛితంగా హెర్డ్ ఇమ్యూనిటీ దేశ ప్రజలకు పెరిగినట్లుగా చెప్పక తప్పదు. కేసుల నమోదు చూస్తే.. కచ్ఛితంగా ఇది తగ్గుదలే అని అశోక వర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ షాహిద్ జమీల్ చెబుతున్నారు.

Also Read: వ్యాక్సిన్ ఫైట్.. క్రెడిట్ కోసం పరువు తీసుకుంటున్నారు

జనాభా అధికంగా ఉన్న మహానగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ ముందు ఉంటుంది. కరోనా కేసుల నమోదు తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు ఆరు వేలకు పైనే కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా 384 కేసులు మాత్రమే. ఇలాంటి పరిస్థితికి కారణం హెర్డ్ ఇమ్యూనిటీ కూడా కావొచ్చంటున్నారు. లోకల్ హెర్డ్ ఇమ్యూనిటీ ప్రజల్లో పెరగటమే కేసుల నమోదు తగ్గుతోందట. భారత్ లో యువ జనాభా ఎక్కువ. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోబడి ఉన్న వారే. అందుకే హెర్డ్ ఇమ్యునిటీ పెరగటానికి సాయం చేసిందని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్