Parag Desai Street Dog Attack: విధి చాలా క్రూరమైనది. ఎన్నో కలలు, కోరికలు, ఆశయాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నా కూడా ఒక్కసారిగా ముగిసిపోవచ్చు. ఇలాగే వీధికుక్కల దాడిలో ఒక గొప్ప వ్యక్తి అయిన పరాగ్ దేశాయ్ కన్నుమూశారు. ఈ సంఘటన చాలా బాధాకరం.. షాకింగ్. అతను ఒక వారసత్వ వ్యాపారాన్ని అధునాతన ప్రపంచానికి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు. పరాగ్ దేశాయ్ జీవితం, విజయాలు .. దురదృష్టవశాత్తు ఆయన మరణం అందరికీ వీధికుక్కలతో ఎలా ఉండాలన్న విషయాన్ని పాఠంగా చెబుతోంది.
Also Read: తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు..!
పరాగ్ దేశాయ్: ఒక వ్యాపార దిగ్గజం
వాఘ్ బక్రీ టీ గ్రూప్ అధినేత పరాగ్ దేశాయ్, తన వ్యాపార నైపుణ్యాలతో, భారతీయ టీ వ్యాపారంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అతని నాయకత్వంలో, సంస్థ దేశవ్యాప్తంగా ₹2,000 కోట్ల వ్యాపారంగా ఎదిగింది, 24 రాష్ట్రాల్లో విస్తరించింది. లాంగ్ ఐలాండ్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన పరాగ్, సేల్స్, మార్కెటింగ్, ఎగుమతుల విభాగాలను నిర్వహించడంలో ప్రత్యేక ప్రావీణ్యం చూపారు.
– విజయాలు , ఆవిష్కరణలు
పరాగ్ దేశాయ్ స్మార్ట్ వ్యాపార నమూనాలు, టీ లాంజులు, డిజిటల్ మార్కెటింగ్ వంటి వినూత్న ఆలోచనలను ప్రవేశపెట్టారు. ఇవి వాఘ్ బక్రీ బ్రాండ్‌ను ఆధునిక కస్టమర్లకు మరింత దగ్గర చేశాయి. అతను కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యూహకర్త, , తన కుటుంబం పట్ల అపారమైన ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన తన భార్య విదిషా, కుమార్తెలు పరిషాలకు ఒక మంచి భర్త, తండ్రిగా కూడా జీవించారు.
-దురదృష్టకరమైన సంఘటన
అక్టోబర్ 15, 2023న ఉదయం, తన నివాసం దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు వీధికుక్కల దాడికి గురయ్యారు. కుక్కల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జారిపడి, తలకు తీవ్రమైన గాయం తగిలింది. వెంటనే సెక్యూరిటీ గార్డులు ఆయనను షెల్బీ ఆసుపత్రికి తరలించారు, తరువాత మెరుగైన చికిత్స కోసం జైడస్ హాస్పిటల్‌కు మార్చారు. కానీ, ఆయన మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) కారణంగా పరిస్థితి విషమంగా మారింది. దాదాపు 7 రోజుల పాటు వెంటిలేటర్‌పై పోరాడి, అక్టోబర్ 22, 2023న ఆయన చివరి శ్వాస విడిచారు.
Also Read: తండ్రిని పోగొట్టుకున్న ఓ కూతురు పడే వేదనకు ముగింపు ఎప్పుడు?
పరాగ్ దేశాయ్ గారి మరణం, వీధికుక్కల వలన జరిగే ప్రమాదాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఉదయం లేదా సాయంకాలం నడిచేటప్పుడు, చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. వీలైనంత వరకు ఇంటికి దగ్గరగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే నడవండి.ఏదైనా అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం వెంటనే చేరుకోగల ప్రాంతాలను ఎంచుకోండి. వీధికుక్కల నియంత్రణకు స్థానిక అధికారుల సహాయం తీసుకోండి మరియు ఇలాంటి సంఘటనల గురించి ఇతరులకు చెప్పి అప్రమత్తం చేయండి.