Heavy Rain Alert: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన తెలిపింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అయితే అర్ధరాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాలు నమోదు కానున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
Also Read: ఇలా జరుగుతుందని జగన్ కి ముందే తెలుసా? అందుకే సిద్ధమవుతున్నాడా?
అల్పపీడనంగా ద్రోణి
ప్రస్తుతం బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈరోజు అది అల్పపీడనంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో ఏపీలో నంద్యాల, ప్రకాశం, బాపట్ల,పలనాడు, గుంటూరు,కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read: అమరావతికి నందమూరి బాలకృష్ణ.. రేపే ముహూర్తం!
వానలు ప్రారంభం..
మరోవైపు మంగళవారం అర్ధరాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కుండ పోత వాన పడింది. గుంటూరు( Guntur ), ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో భారీ వర్షం కురిసింది. గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అనంతపురం,కర్నూలు, నంద్యాల, వైయస్సార్ కడప,పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణ,ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి.