HomeజాతీయంBihar Election Result 2025: మేజిక్‌ ఫిగర్‌ దాటేసిన ఎన్డీఏ.. ఈసారి నితీశ్‌ ప్లేసులో బీజేపీ...

Bihar Election Result 2025: మేజిక్‌ ఫిగర్‌ దాటేసిన ఎన్డీఏ.. ఈసారి నితీశ్‌ ప్లేసులో బీజేపీ ముఖ్యమంత్రేనా?!

Bihar Election Result 2025: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఎన్డీఎఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మ్యాజిక్‌ పిగర్‌ 122 దాటి 170 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు విపక్ష కూటమి మహాఘట్‌బంధన్‌ 80 సీట్ల వద్ద నిలిచిపోయింది. ఎన్డీయే సమష్టిగా..ఈసారి ఎన్డీయే భాగస్వామ్య కూటమి సమన్వయ వ్యూహం ఫలిస్తోంది. జేడీయూ, భాజపా రెండూ చెరో 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం, నితీశ్‌ నేతత్వం చుట్టూ ఏర్పడిన స్థిరత్వ భావనను బలపరిచింది. హిందుస్థానీ అవామ్‌ మోర్చా, రాష్ట్రీయ లోక్‌మోర్చా వంటి చిన్న కూటముల మద్దతు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. విపక్ష కూటమిలో ప్రధాన పార్టీగా నిలిచిన ఆర్జేడీ 56 సీట్లలో ముందున్నప్పటికీ ఆశించినంత ఉత్సాహం కనబడడంలేదు. కాంగ్రెస్, వామపక్షాలు పరస్పర పోటీ పరిస్థితులు మహాఘట్‌బంధన్‌ ప్రస్థానాన్ని బలహీనపరిచాయి. ఫలితంగా ఐక్యత బలహీనమై వ్యూహాత్మక లోపాలు బయటపడ్డాయి.

ఓటింగ్‌లో మహిళల ఆధిక్యం..
ఈసారి మహిళా ఓటర్ల సక్రియ భాగస్వామ్యం చర్చనీయాంశం అయింది. పురుషుల కంటే (62.98 శాతం) మహిళలలో (71.78 శాతం) అధికంగా ఓటు వేయడం బిహార్‌ సమాజంలో మారుతున్న చైతన్యానికి సంకేతం. 1951 తర్వాత మొదటిసారి 67 శాతం రికార్డు పోలింగ్‌ నమోదయ్యింది. ఇది ప్రజల్లో రాజకీయ అవగాహన పెరిగిందనడానికి నిదర్శనం.

సమీకరణాలకు అవకాశం..
నితీశ్‌కుమార్‌ మూడుసార్లు ముఖ్యంత్రిగా ఉన్నారు. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి సీఎం పదవి చేపడతారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే కేంద్రంలో ఎన్డీఏలో జేడీయూ కీలక భాగస్వామి. పార్టీ మద్దతు లేకుంటే కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఈ నేపథ్యంలో నితీశ్‌కు ఉపరాష్ట్రపతి పదవి హామీ ఇస్తే.. బిహార్‌లో బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. తాజా ఫలితాల ధోరణి బిహార్‌ ప్రజలు మళ్లీ స్థిరత్వం, అభివద్ధి, అనుభవం వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది. నితీశ్‌ కుమార్‌ తిరిగి సింహాసనం అధిరోహిస్తే, అది ఆయన రాజకీయ జీవితం లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version