Bihar Election 2025 Ramachandra Yadav: భారత చైతన్య యువజన పార్టీ అలియాస్ బిసివైపీ.. ఇటీవల తరచూ వినిపిస్తున్న మాట ఇది. బోడె రామచంద్ర యాదవ్ ( Ramachandra Yadav)అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పుంగనూరు నుంచి పోటీ చేశారు రామచంద్ర యాదవ్. కానీ గత ఎన్నికలకు ముందు ఏకంగా పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు సమయంలో ఒక కార్పొరేట్ తరహాలో ఏర్పాట్లు సాగాయి. అయితే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసింది. బీసీ నినాదంతో బరిలోకి దిగింది. రెండు చోట్ల పోటీ చేశారు రామచంద్ర యాదవ్. రెండింట డిపాజిట్లు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఏకంగా బీహార్ ఎన్నికల్లో తలపడుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కు సవాల్ విసురుతున్నారు. ఏకంగా బీహార్ లోనే తలపడుతున్నారు అంటే.. బ్యాక్ గ్రౌండ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఇది రాజకీయ వ్యూహమేనని తెలుస్తోంది.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
* వ్యాపారిగా సుపరిచితం..
పుంగనూరుకు ( Punganuru) చెందిన రామచంద్ర యాదవ్ వ్యాపారి అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఏ వ్యాపారం చేస్తారో తెలియదు కానీ.. భారీగా ఖర్చు చేస్తారన్న పేరు ఉంది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం చేశారు. ఈ క్రమంలో కేసులకు కూడా గురయ్యారు. అయితే ఉత్తరాధి రాష్ట్రాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో నేరుగా సమావేశం కాగలరు. ఆయనకు ఇట్టే అపాయింట్మెంట్ లభిస్తుంది కూడా. ఆయన చాలా రిచ్ గా కూడా కనబడతారు. హెలికాప్టర్లను సైతం వాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు.
* భారీ కాన్వాయ్ తో బీహార్ కు..
అయితే ఇప్పుడు భారీ కాన్వాయ్ తో బీహార్ ఎన్నికలకు బయలుదేరారు. అక్కడ అభ్యర్థులను నిలిపే ప్రయత్నంలో ఉన్నారు. ఆపై యాదవ సామాజిక వర్గం కావడం.. బీసీ నినాదంతో ముందుకు వెళుతుండడం.. ఏకంగా తేజస్వి యాదవ్ పై ( Tejasvi Yadav )సవాల్ విసురుతుండడం చూస్తుంటే మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టు ఉంది. ఇండియా కూటమి పై చేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో బోడె రామచంద్ర యాదవ్ హడావిడి చూస్తుంటే కచ్చితంగా యాదవ సామాజిక వర్గం ఓట్లు చీల్చేందుకేనని అర్థమవుతోంది. బోడె రామచంద్ర యాదవ్ వెనుక కచ్చితంగా బిజెపి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి.
* ఓవైసీ మాదిరిగా..
బీహార్ ఎన్నికలు అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓవైసీలు వాలిపోతారు. గతంలో అక్కడ నుంచి ఎంఐఎం గెలిచిన పరిస్థితి ఉంది. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో.. ఎంఐఎం ఓట్లు చీల్చి.. ఫలితాలు తారుమారైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా బోడె రామచంద్ర యాదవ్ ద్వారా.. బీహార్ ఎన్నికల్లో బిజెపి లబ్ధి పొందాలని చూస్తోంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
బీసీ ల రాజ్యాధికారం కోసం పుట్టిన #BCYP పార్టీ బీహార్ ఎన్నికల్లో బీసీ బిడ్డనైన Tejashwi Yadav ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్న బోడె రామచంద్ర యాదవ్ !!!
సొంత రాష్ట్రం ఆంధ్రాలోనే డిపాజిట్లు రాని వ్యక్తి కి బీహార్ లో ఏమి పని అంటున్న బీహార్ ప్రజలు. pic.twitter.com/AgGWKPRhBH
— MC RAJ️ (@BeingMcking_) August 26, 2025