Bed Room Romance: దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకుని వినూత్న రీతిలో తప్పుదారి పట్టిస్తున్నారు. ఫలితంగా రూ.లక్షలు గుంజుతూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. ఇవ్వకపోతే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. వరుసగా మోసాలకు పాల్పడున్న గ్యాంగ్ నిజ రూపం తెలియడంతో అందరు ఖంగుతిన్నారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలోని జామ్ నగర్ లో మూడు నెలల క్రితం ఓ వ్యక్తికి అనుకోకుండా ఓ వీడియో కాల్ వచ్చింది. దీంతో అవతలి వ్యక్తి వేరే వాళ్లకు చేయబోతే మీకు వచ్చిందని తియ్యని గొంతుతో సమాధానం. దీంతో స్పందించిన అతడు ఆమె వాయిస్ కు ఫిదా అయ్యాడు. తరువాత వారి మధ్య మాటలు కలిశాయి. ఇద్దరు పెళ్లి చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. అయితే మీరు ఓ సారి మా ఇంటికి రావాలని సూచించింది. దీంతో అతడు ఆమె కోరిక మేరకు ఆమె ఇంటికి వెళ్లగా ఒంటరిగా ఉన్న ఆమె అతడిని ముగ్గులోకి దింపింది.
దీంతో ఇద్దరు వివస్ర్తలై ఉన్న సమయంలో ఓ ఆంటీ, అంకుల్ వచ్చి వీడియో తీశారు. సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని చెప్పడంతో అతడు కాళ్ల బేరానికి వచ్చాడు. దీంతో అతడి నుంచి రూ. లక్షలు గుంజారు. దీంతో భయపడిన అతడు తన తప్పుకు పాశ్చాత్తాపపడి తగిన మూల్యం చెల్లించాడు. గ్యాంగ్ మోసాలకు అంతే లేకుండా పోయింది. ఇలా పలువురిని బుట్టలో వేసుకుంటూ వారి నుంచి అందినకాడికి దోచుకుంటోంది.
ఎట్టకేలకు మరో యువకుడిని కూడా ఇదే తరహాలో మోసం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అతడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మగవారి బలహీనతలే లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్న జంట ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు.