RRR: అతిపెద్ద పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ ఆర్ ఆర్ విడుదల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టిన రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో, ఇండియా వైడ్ హైప్ నెలకొంది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్స్ లో, పలు భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇక రిలీజ్ కి కేవలం రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా, రాజమౌళి భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

కాగా ఆర్ ఆర్ ఆర్ పై పరిశ్రమలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అది ఏమిటంటే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ సాంగ్ పాడారట. మల్టీ టాలెంటెడ్ ఎన్టీఆర్ తో రాజమౌళి, కీరవాణి ఓ పాట పాడించారని, మాస్ బీట్ లో సాగే సదరు సాంగ్ ని.. ఎన్టీఆర్ అద్భుతంగా పాడారు అంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ పాడిన ఆ పాటను విడుదల చేయనున్నారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ, భారీగా ప్రచారం అవుతుంది.
Also Read: Jr NTR Reaction: చంద్రబాబు ఏడుపు.. వైసీపీ అరాచకంపై జూ.ఎన్టీఆర్ ఘాటు స్పందన
ఇక ఎన్టీఆర్ ని సింగర్ గా మార్చిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం యమదొంగ లో ఎన్టీఆర్ మొదటిసారి… హీరోయిన్ మమతా మోహన్ దాస్ తో కలిసి మాస్ సాంగ్ ఆలపించారు. అనంతరం కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో చిత్రాలలో ఎన్టీఆర్ సాంగ్స్ పాడడం జరిగింది. ఇటీవల ఆకస్మిక మరణం పొందిన, కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ మూవీలో ఎన్టీఆర్.. ఓ కన్నడ సాంగ్ కూడా పాడడం విశేషం. కాగా రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.