Ram Mandir: భారతీయ హిందువుల ఏళ్లనాటి కల మరో ఐదు రోజుల్లో సాక్షాత్కారం కాబోతోంది. హిందువుల కళ్లలో ఆనందం ఉట్టిపడే అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామరాజ్యస్థాపన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపురూప ఘట్టానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ బాల రాముడు అయోధ్యకు బయల్దేరాడు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న రామాలయంలో కొలువుదీరనున్న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్టకు బుధవారం అయోధ్య చేరుకోబోతున్నాడు.
వేడుకలు షురూ..
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ శిల్పి అరుణ్‌యోగిరాజ్ తయారు చేసిన బాలరాముడి విగ్రహాన్ని రామాలయంలో ప్రతిష్టాపనకు ఎంపిక చేశారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకు వస్తోంది.
అందరి మదిలో నిలిచేలా..
వనవాసం వీడిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు చేరుకుని పట్టాభిశక్తుడు అయినట్లుగా.. అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించేందకు ఏర్పాట్లు చేశారు. ప్రతీ హిందువు మదిలో నిలిచేలా రామ్‌లల్లా విగ్రహాన్ని భారీ ఊరేగింపు నడుమ అయోధ్యలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటు చేసింది. బుధవారం అయోధ్యకు చేరిన బాలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలోకి ప్రవేశపెట్టనున్నారు. నేడు అందరి ముంద ఆవిష్కరించే రామ్‌లల్లా విగ్రహం ఐదేళ్ల పసి బాఉలడి రూపంలో తయారుచేశారు. పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.