Ram Mandir: భారతీయుల ఐదు శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో మేషలగ్నం, అభిషత్ ముమూర్తంలో జనవరి 22(సోమవారం) మధ్యాహ్నం 12:32:29 సెకన్లక బాల రాముడు కొలువుదీరాడు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట గావించారు. అంతకు ముందు రామ్ లల్లాకు మోదీ పట్టు వస్త్రాలు, వెండి ఛత్రి తీసుకుని వచ్చారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన బాల రాముడిని అపురూప దివ్య స్వరూపాన్ని ఆవిష్కరించారు. రామ్ లల్లా దివ్య స్వరూపాన్ని తిలకించి యావద్ దేశం పులకించిపోయింది. నీలి కళ్ల రాముడు.. అందరికకీ ఒక ధైర్యంగా నిలిచాడు. యావత్ భారతావనికి ఒక నమ్మకం కలిగించాడు.
పూజలో ప్రముఖులు
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పూజలు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. బాల రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హారతి ఇచ్చిన మోదీ..
ప్రాణ ప్రతిష్ట అనంతరం బాల రాముడికి ప్రధాని మోదీ 108 హారతులతో హారతి ఇచ్చారు. అర్చన చేశారు. నైవేద్యాలు సమర్పించారు. తాను తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, వెండి ఛత్రిని కూడా బాల రాముడికి సమర్పించారు.
పులకించిన భారతం..
అయోధ్యలో కొలువు దీరిన బాల రాముడిని చూసి యావత్ భారత్ పులకించింది. తొలిదర్శనం నిజంగా అద్భుతంగా ఉంది. రాముని ముగ్ధ మనోహర రూపం చూపి ఎంత అందగా ఉన్నాడు మా రాముడు అని చర్చించుకుంటున్నారు. అదిగో చూడండి శ్రీరాముడు అంటూ సోషల్ మీడియాలో రామయ్య ఫొటోలు పోస్టు చేశారు. డీపీలుగా బాల రాముడి ముగ్ధ స్వరూపాన్ని పెట్టుకున్నారు.