Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. మరో 48 గంటల్లో రామ్ లల్లా ఆలయంలో కొలువుదీరనున్నాడు. దేశమంతా 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాముడు అయోధ్యలో సాక్షాత్కరించబోతున్నారు. దీంతో దేశమంతా రామనామం మార్మోగుతోంది. జగదభి రాముడిని గర్భగుడిలో చూసి తరించేందుకు ప్రతీ హిందువు నిరీక్షిస్తున్నాడు. ఇక, దేశమంతటా ఏ ఇద్దరు కాలిసినా రామాలయం గురించే చర్చించుకుంటున్నారు. ట్రెండీగా ఆలోచిస్తున్న కొందరు.. తమ కాలర్ ట్యూన్‌ను రామ జపంగా మార్చేస్తున్నారు. అయోధ్యలో రాముడు కొలువుదీరనున్న ఈ చారిత్రక సందర్భంలో జై శ్రీరామ్ లేదా రాముడి పాటలను కాలర్ ట్యూన్‌గా పెట్టుకునేందుకు సెల్యులార్ కంపెనీలు ఏర్పాట్లు చేశాయి. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్–ఐడియాలో శ్రీరామ భజనను మీ కాలర్ ట్యూన్, హలో ట్యూన్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాయి.
వొడాఫోన్–ఐడియాలో..
వొడాఫోన్–ఐడియా యూజర్లు తమ ఫోన్లలో జై శ్రీరామ్ లేదా రాముడి పాటను కాలర్ ట్యూన్‌గా పెట్టుకోవడానికి వీఐ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత కాలర్ ట్యూన్స్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ఒక కేటలాగ్ కనిపిస్తుంది. వాటిలో సెర్చ్ చేస్తే శ్రీరాముని శ్లోకాలు కనిపిస్తాయి. అందులో నచ్చిన పాటను కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకోవచ్చు.
ఎయిర్ టెల్ వినియోగదారులు..
ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్న వినియోగదారులు ఫోన్‌లో వింక్ మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఫోన్ నంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే యాప్‌లోకి వెళ్తారు. యాప్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో శ్రీరామ్ పాటలు అని టైప్ చేయగానే రాముడి పాటలు వస్తాయి. వాటిని మీ కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకోవచ్చు. అందరికీ ఒకే పాటను సెట్ చేయవచ్చు. లేదా ఒక్కో కాలర్‌కు ఒక్కో పాటను కూడా పెట్టవచ్చు. ఇదంతా ఉచితంగానే అందిస్తుందీ వింక్ మ్యూజిక్ యాప్. ఇది నెలరోజులు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. మీరు ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తుంటే, 543211 కు కాల్ చేసి ఇష్టమైన పాటను కాలర్ ట్యూన్‌గా పెట్టుకోవచ్చు.
జియో వినియోగదారులు..
ఇక జియో నెట్ వర్క్ సిమ్ వాడుతున్న వినియోగదారులు మై జియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రెండింగ్ నౌ అనే విభాగానికి వెళ్లి జియో ట్యూన్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత సెర్చ్ బాక్స్‌లోకి వెళ్లి జై శ్రీరామ్, రామ్ హారతి, రామ్ భజన, శ్రీరామ్ సాంగ్స్ అని ఎంటర్ చేస్తే అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత సెట్ జియో ట్యూన్ మీద క్లిక్ చేయండి. ఎస్‌ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇది కాకుండా మీ వద్ద ఫీచర్ ఫోన్ ఉంటే, 56789కు కాల్ చేసి కూడా శ్రీరాముడి పాటలను కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకోవచ్చు.