Vyjayanthi Movies: ప్రస్తుతం పాన్ ఇండియా లో ప్రభాస్ హవా ఎక్కువగా నడుస్తుందనే చెప్పాలి.ఈయన వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీద ఉన్నాడు. ఇక ఇప్పటికే సలార్ సినిమా రిలీజ్ అయి మంచి వసూళ్ళను సాధిస్తూ ముందుకు కదులుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 700 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంక ఈ సినిమా థియేటర్ లో నడుస్తున్నప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓటిటి లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ చేయబోయే సినిమాలు కూడా విపరీతమైన అంచనాలు పెంచుతున్నాయి.
ఇక ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో తను చేస్తున్న రాజా సాబ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ లుక్ ను చూసిన అభిమానులు మరోసారి ప్రభాస్ మంచి మాస్ ఎంటర్టైనర్ లో నటించబోతున్నాడు అంటూ ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమాలో తను ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా గ్లింప్స్ ని చూస్తే నే మనకు ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అది గెస్ట్ రోల్ లోనా, లేదంటే ఇంపార్టెంట్ క్యారెక్టరా అనేది తెలియదు కానీ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వైజయంతి సినిమాలకి విజయ్ సెంటిమెంట్ గా మారాడు అంటూ మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.ఎందుకంటే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ ని ఒక చిన్న పాత్రలో తీసుకున్నారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే మహానటి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఒక చిన్న పాత్రలో నటించాడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే కల్కి సినిమాలో కూడా నటిస్తే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే తనని తీసుకుంటున్నారు.
ఇక వైజయంతి మూవీస్ లో తను ఒక లక్కీ పర్సన్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక విజయ్ తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికి వైజయంతి బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ కూడా ఇప్పటికే మహానటి, సీతారామం సినిమాలలో నటించి ఈ బ్యానర్ లో ఒక మెంబర్ అయిపోయాడు. దాంతో కల్కి లో కూడా తను నటిస్తున్నట్టు గా తెలుస్తుంది…