Ashwini Vaishnav : శభాష్ అశ్విని వైష్ణవ్.. అసలు ఎవరీ రైల్వే మంత్రి.. ఒడిషాకు అతడికి అనుబంధమేంటి?

అశ్విని వైష్ణవ్ గతంలో ఆయనో ఐఏఎస్ అధికారి. 1970లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జన్మించారు. 1991లో జోధ్‌పూర్ ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్‌వీయూ) నుంచి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగులో గోల్డ్ మెడలిస్ట్.

Written By: NARESH, Updated On : June 7, 2023 9:40 am
Follow us on

Ashwini Vaishnav : అందరిలా ఆయన పారిపోలేదు.. వెన్నుచూపలేదు. పరిస్థితికి ఎదురొడ్డాడు. తప్పును ఒప్పుకున్నాడు. ఆ తప్పును దగ్గరుండి మరీ సరిదిద్దారు. కేవలం రెండు రోజుల్లోనే ట్రాక్ ను పూర్తి చేసి పట్టాలెక్కించాడు. ఏ కేంద్రమంత్రి కూడా ఇలా రెండు రోజుల పాటు రైల్వే ట్రాక్ లపై ఉండి పనులు చేయించిన దాఖలాలు లేవు. కానీ మన కేంద్ర రైల్వే మంత్రి మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. పోయిన ప్రాణాలను తిరిగి తెప్పించలేకపోయినా.. ఆ తప్పును సరిదిద్దడం.. ప్రాణాలకు నష్టపరిహారం.. బంధువులకు చేర్చడంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన కృషికి సోషల్ మీడియాలో అభినందలు కురుస్తున్నాయి.

అశ్విని వైష్ణవ్ గతంలో ఆయనో ఐఏఎస్ అధికారి. 1970లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జన్మించారు. 1991లో జోధ్‌పూర్ ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్‌వీయూ) నుంచి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగులో గోల్డ్ మెడలిస్ట్. ఆ తరువాత ఐఐటీ కాన్పూర్ నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. 1994 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో దేశంలోనే 27వ ర్యాంకు సాధించారు. ఒడిశా కేడర్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరిన ఆయన.. ఒడిశాలోని వివిధ ప్రాంతాలలో పనిచేశారు. బాలసోర్, కటక్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2003లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమించబడ్డాడు.

2008లో ఐఏఎస్ విధులకు సెలవు తీసుకుని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ నుండి MBA చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చాక GE ట్రాన్స్‌పోర్టేషన్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరారు. తరువాత అతను సిమెన్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌ పదవి చేపట్టారు. 2012లో గుజరాత్ లో త్రీ టీ ఆటో లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీగీ ఆటో కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లను నెలకొల్పారు.

రాజకీయ నాయకునిగా..
2019 జూన్ నెలలో భారత రాజ్యసభ సభ్యుడిగా ఒడిశా నుంచి ఎన్నికయ్యారు. 2021 జూలై 8 నుంచి కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొన్న రైలు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తన పదవికి రాజీనామా చేసి తప్పించుకోలేదు. శుక్రవారం రాత్రి నుంచి రైళ్ల ప్రమాద ఘటనా ప్రాంతంలోనే మంత్రిగా కార్యోన్ముఖుడై సహాయక సిబ్బందితో కలిసి రేయింబవళ్ళు సేవలు అందిస్తున్నారు. అక్కడే ఉంటూ అన్ని శాఖలు, సిబ్బందిని సమన్వయం చేస్తూ పని చేయిస్తున్నారు..ఇకపై ఆయన రైల్వే మంత్రిగా కొనసాగాలా వద్దా అనేది ఆయన ఇష్టం..ఆయన సేవలు అవసరమా లేదా అనేది కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పాలకులు.. అంతిమంగా ప్రజల ఇష్టం.