https://oktelugu.com/

Arun Yogiraj: అయోధ్యలో రాముడు మారిపోయాడా? శిల్పి సంచలన వ్యాఖ్యలు

అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది .

Written By:
  • Dharma
  • , Updated On : January 25, 2024 / 11:47 AM IST
    Follow us on

    Arun Yogiraj: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. వేలాది మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాగా.. కోట్లాది మంది ప్రత్యేక ప్రసారాల ద్వారా వీక్షించారు. 500 ఏళ్ల నాటి కల సాకారం కావడంతో యావత్ దేశం జైశ్రీరామ్ నినాదంతో మార్మోగిపోయింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు ముగియడంతో.. సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

    అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది . ఈ క్రమంలోనే అనేక రకాల వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి. బాల రాముడు కళ్ళు తెరిచి ఉన్నట్లు ఉన్న ఓ వీడియోను చూసి భక్తులు పరవశించి పోతున్నారు. చిరునవ్వుతో కంటి రెప్పలు కొడుతూ తలను అటు ఇటు కదిలిస్తూ చూస్తున్నట్టు ఉన్న వీడియో ఎక్కువగా వైరల్ గా మారింది. కొంతమంది ఎడిటింగ్ చేసి ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

    ఇటువంటి పరిస్థితుల్లో విగ్రహాన్ని చెక్కిన శిల్పి యోగి రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణ ప్రతిష్ట తర్వాత రాముడు మారిపోయాడు అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత నేను చిక్కిన శిల్పం చాలా మారిపోయింది. అసలు నేను చేసిన విగ్రహమేనా అనే డౌట్ వచ్చింది. గత పది రోజులుగా అక్కడే ఉన్నా.. ప్రతిష్టాపన తర్వాత రామ్ లల్లా ముఖంలో చిరునవ్వు, కళ్ళలో భావాలు మారిపోయాయి అని శిల్పి యోగిరాజ్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాముడికి సంబంధించి ఏ చిన్న అంశమైనా వైరల్ గా మారుతుంది. అందునా బాలరాముడు విగ్రహాన్ని చెక్కిన శిల్పి మాటలు మరింత వైరల్ అవుతుండడం విశేషం.