
దేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి అని తెలిసిందే. ఆధార్ కార్డ్ ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా కూడా ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డ్ ద్వారా అనేక పథకాల్లో అక్రమాలు జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే చాలామంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోజనాలను పొందడం కోసం ఆధార్ కార్డులోని డేటాను మారుస్తుండటం గమనార్హం.
Also Read : బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు
తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ కార్డుల్లో డేటా మార్పు వ్యవహారం భారీ ఎత్తున జరిగింది. కొందరు తమ పుట్టిన తేదీని మార్చుకుని ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 15 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఆధార్ కార్డులోని వయస్సును మార్చుకునే అవకాశం ఉంటుంది. మీసేవా కేంద్రాల్లో లేదా ఆధార్ కేంద్రాల్లో దరఖాస్తు చేసి వయస్సును మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా సమర్పించిన దరఖాస్తులను యూఐడీఏఐ అధికారులు పరిశీలించి అన్ని ధ్రువపత్రాలు సరిగ్గా ఉంటే ఆధార్ కార్డులో వయస్సును మారుస్తారు. అయితే దీనిని అలుసుగా తీసుకున్న అక్రమార్కులు ఒక్కో కార్డులో పుట్టినతేదీని మార్చడం కోసం 3 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికారుల విచారణలో ఈ తరహా మోసాలు వెలుగులోకి రావడం గమనార్హం.
కొందరు ఇతర ధ్రువీకరణ పత్రాల్లో పుట్టిన తేదీని మార్చి ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉండటం గమనార్హం. బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్ స్థాయి, తపాలా కార్యాలయాల్లో పోస్టు మాస్టర్ స్థాయి అధికారులు పత్రాలను పరిశీలించి సంతకం చేసిన తర్వాతే దరఖాస్తు చేయాల్సి ఉండటంతో కొందరు పాన్ కార్డులలో పుట్టినతేదీని మార్చుకుంటూ ఉండటం గమనార్హం.
Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?