HomeజాతీయంSmart Trolley: మన హైదరాబాద్ అద్భుతానికి ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా.. ఏం ట్వీట్ చేశాడో...

Smart Trolley: మన హైదరాబాద్ అద్భుతానికి ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా.. ఏం ట్వీట్ చేశాడో తెలుసా?

Smart Trolley: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ తరహా టెక్నాలజీని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ డిజిటలీకరణలో ఇది మరో కీలక ముందడుగుగా చెప్పొచ్చు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఈ-బోర్డింగ్, ఫేస్ రికగ్నిషన్ వంటి అధునాతన వ్యవస్థలను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రపంచంలో స్మార్ట్‌ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్‌పోర్ట్ మనదే.

3 వేల ట్రాలీలు..
ఎయిర్‌పోర్ట్ బ్యాగేజీ ట్రాలీల కోసం లాంగ్ రేంజ్ ఐవోటీ ప్లాట్‌ఫాంను జీఎంఆర్ ఏర్పాటు చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా దాదాపు 3 వేల బ్యాగేజీ ట్రాలీలను అనుసంధానించిన క్రమంలో.. ప్రయాణికుల వెయిటింగ్ టైం గణనీయంగా తగ్గుతుంది. ఎయిర్ పోర్టుల్లో ట్రాలీ మేనేజ్‌మెంట్ అనేది డైనమిక్ ప్రాసెస్. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రమాణాల మేరకు 10 లక్షల మంది ప్రయాణికులకు కనీసం 160 ట్రాలీలు అందుబాటులో ఉండాలి. ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లోనే 3 వేల ట్రాలీలు ఉన్నాయి.

ఎక్కడున్నా గుర్తించే వీల..
వచ్చే, పోయే ప్రయాణికులకు ట్రాలీలను అందుబాటులో ఉంచడంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఎంతగానో శ్రమిస్తుంటారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను ఐవోటీ ఆధారిత స్మార్ట్ ట్రాలీ మేనేజ్‌మెంట్ ద్వారా అధిగమించే వీలుంది. ఎయిర్‌పోర్ట్‌లో ట్రాలీలు ఏ మూలన ఉన్నా గుర్తించి ఒక చోటుకి చేర్చడం ఈ టెక్నాలజీతో సులభతరం కాగలదు.

స్మార్ట్‌ ఫీచర్స్‌..
స్మార్ట్ ట్రాలీ వ్యవస్థ యూజర్ ఫ్రెండ్లీ. మొబైల్, డెస్క్ టాప్, లాప్‌టాప్‌పైనా ఇది పనిచేస్తుంది. నో-జోన్ ఏరియాలోకి ట్రాలీలను తీసుకెళ్తే.. మనల్ని అప్రమత్తం చేసేలా ఇన్-బిల్ట్ అలర్ట్ మెకానిజం ఇందులో ఏర్పాటు చేశారు. నో-జోన్‌లోకి ట్రాలీ ప్రవేశించగానే.. వెంటనే మెసేజ్ వస్తుంది. విమానం ఆలస్యం ఉందా? లేదా? అనే సమాచారాన్ని రియల్‌టైమ్‌లో తెలుసుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది. ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో ఆ వివరాలు వస్తాయి. మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే చాలు.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు వెంటనే ఆ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది. బోర్డింగ్‌‌కు వ్యవధి ఉంటే షాపింగ్ చేసుకొనేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏయే షాపులు.. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆయా షాపులు అందజేస్తున్న ఆఫర్ల ఏమిటి? అన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే వాష్‌రూంలు, రెస్టారెంట్ల గురించి సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుంది.

‘ప్రెట్టీ కూల్’ చూడండి..
భారతీయ అటోమొబైల్‌ వా‍్యపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా శంషాబాద్‌ విమానాశ్రయంలో స్మార్ట్‌ ట్రాలీ సర్వీస్‌లపై గురువారం ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. “అది చాలా బాగుంది. విదేశీ విమానాశ్రయాలలో నేను అలాంటి ట్రాలీలను ఎన్నడూ ఎదుర్కోలేదు. కానీ నేను తప్పు చేసి ఉండవచ్చు. వీటిని పరిచయం చేసిన మొదటి వ్యక్తులలో మనం నిజంగా ఉన్నామా?” అని పేర్కొన్నారు. స్మార్ట్ ట్రాలీలను ఎలా ఉపయోగించాలి అనే వీడియోతో పోస్ట్‌కు జోడించారు.

స్పందించిన ‘జీఎంఆర్‌’
ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌కి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి రిప్లయ్‌ వచ్చింది. విమానాశ్రయాలలో స్మార్ట్ ట్రాలీలను ప్రవేశపెట్టడం మొదటి సదుపాయమని వారు ధృవీకరించారు. “ప్రియమైన సర్, మీ దృష్టిని ఆకర్షించింది. ఈ అత్యాధునిక ట్రాలీలకు మార్గదర్శకత్వం వహించడానికి మేము సంతోషిస్తున్నాము, ప్రయాణ అనుభవానికి కొత్తదనాన్ని జోడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ను సెట్ చేయడానికి ఇది మా మార్గంగా పరిగణించండి” అని విమానాశ్రయం ‘ఎక్స్‌’లో పేర్కొంది.

= “త్వరలో భారతదేశం సాంకేతికతలో అమెరికాను అధిగమిస్తుందని, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విమానాశ్రయాలు దక్షిణాసియాలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలుగా మారుతున్నాయి” అని ఒక వినియోగదారు రాశారు.

= “ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి విమానాశ్రయాలు తక్కువ ఖర్చుతో కూడుకున్న మరియు జీరో లేబర్‌గా ఉండే ఇటువంటి స్మార్ట్ వస్తువులను పరిచయం చేయాలి” అని మరొక వినియోగదారు రాశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular