https://oktelugu.com/

జగన్ ధాటికి చంద్రబాబు రాజకీయ సన్యాసమేనా?

ఏపీలో అధికారం కోల్పోయి తీవ్ర నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో.. భారీ కుదుపు చోటు చేసుకోబోతోందా? చంద్రబాబుపై పార్టీ శ్రేణులతోపాటు, ఎమ్మెల్యేల్లోనూ విశ్వాసం సన్నగిల్లుతోందా? అంటే.. అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇంతకీ.. టీడీపీ శాసనసభ్యులు ఏం చేయబోతున్నారు? అది పార్టీ భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? Also Read: మళ్లీ కోర్టుకెక్కిన ‘పంచాయతీ’.. ఈసారి తీర్పు ఎవరీ పక్షానో? ఏపీలో 2019 శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2020 / 10:59 AM IST
    Follow us on

    ఏపీలో అధికారం కోల్పోయి తీవ్ర నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో.. భారీ కుదుపు చోటు చేసుకోబోతోందా? చంద్రబాబుపై పార్టీ శ్రేణులతోపాటు, ఎమ్మెల్యేల్లోనూ విశ్వాసం సన్నగిల్లుతోందా? అంటే.. అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇంతకీ.. టీడీపీ శాసనసభ్యులు ఏం చేయబోతున్నారు? అది పార్టీ భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?

    Also Read: మళ్లీ కోర్టుకెక్కిన ‘పంచాయతీ’.. ఈసారి తీర్పు ఎవరీ పక్షానో?

    ఏపీలో 2019 శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీగా బరిలోకి దిగిన టీడీపీ.. ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ.. కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 175 స్థానాలున్న శాసనసభలో.. ఏకంగా 151 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కలలో కూడా ఊహించని ఈ దారుణ పరాభవాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రి అనే మాట వినేందుకే మనస్కరించలేదు ఆయనకు. ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించడాన్ని తట్టుకోలేక.. పార్టీ నేతలతో పరామర్శల పర్వాన్ని కొనసాగించారు. “మీరు ఓడిపోవడం ఏంటయ్యా..??” అంటూ.. సానుభూతి నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. “నేను సరిగానే పాలించాను, ప్రజలే సరిగా ఓటేయలేదు” అంటూ.. “మా పార్టీని 23 సీట్లకే పరిమితం చేసేంత తప్పు నేనేం చేయలేదు” అన్నారు. ఈ విధమైన ఓటమి నైరాశ్యాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు చంద్రబాబు.

    “చెప్పే మాటా.. చేసే చేతా..” ఇవి రెండూ ఒక్కటవ్వడమే నిజాయితీ. ఇతర విషయాల్లో ఈ నిజాయితీ లెక్క ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం నిక్కచ్చిగా ఉండాలి. నాయకుడు ఏం చెపుతున్నాడు? ఏం చేస్తున్నాడు? అని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. అయితే.. అధికారం కోల్పోయామనే ఉక్రోశంలో టీడీపీ నేతలు తాము మాట్లాడే మాటలు, చేసే చేతలపై నియంత్రణ కోల్పోతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా.. పరిపాలన వికేంద్రీకరించి రాష్ట్రం మొత్తాన్ని సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటే.. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రోద్బలంతో ఆందోళన పర్వం కూడా నడిపించారు. కానీ.. మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మాత్రం చెప్పలేదు. రాష్ట్రం మొత్తం స్వాగతించిన ఈ నిర్ణయాన్ని, అమరావతిలోని రియల్ ఎస్టేట్ మాఫియా మాత్రమే అంగీకరించలేదన్న విషయం బహిరంగ రహస్యమే. ఇలా.. మూడు రాజధానుల విషయంలోనూ టీడీపీ తీసుకున్న వైఖరినీఎ ప్రజలు సమర్థించలేదు. దీంతో చంద్రబాబు అండ్ కో అసహనం రెట్టింపు ఆయ్యింది.

    Also Read: రైతులకు అలర్ట్.. ఈ పంటతో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం..?

    వీరి అసహనం తాజా అసెంబ్లీ సమావేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. సభను సజావుగా నడవకుండా అడ్డుకోవడమే చంద్రబాబు లక్ష్యంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్న చంద్రబాబును సీఎం జగన్ కూల్ గా ఎదుర్కొంటున్నారు. అవసరమైన చోట ధీటుగా సమాధానం ఇస్తూ.. మిగిలిన చోట విపక్ష పాత్రను కూడా సరిగా పోషించ లేకపోతున్న టీడీపీ తీరును ఎండగడుతున్నారు. దీంతో అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విపక్ష శాసనసభ్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాస్తవానికి శాసనసభ ప్రతిపక్షానికి సరైన వేదిక. ప్రభుత్వ నిర్ణయాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని ఎత్తి చూపుతూ.. నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం ద్వారా ప్రజల విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేయాలి. బాధ్యత కలిగిన ఏ విపక్షమైనా ఇదే చేస్తుంది. కానీ.. అది వదిలేసి, తొలిరోజు నుంచే సభా నిర్వహణనే అడ్డుకోవడం.. ఏకంగా విపక్ష నేత పోడియం ముందు కూర్చోవడం చంద్రబాబు ఉద్దేశాన్ని వెల్లడిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    అధికారం కోల్పోవడం.. సీఎం జగన్ ను ధీటుగా ఎదుర్కోలేకపోవడం.. వంటి కారణాలతో టీడీపీ శాసనసభ్యులు అంతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. మళ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండటం.. చంద్రబాబు వయసు మీద పడటం వంటి కారణాలతో.. తమ రాజకీయ భవిష్యత్ పై పునరాలోచిస్తున్నట్టు సమాచారం. ఎన్నాళ్లున్నా.. టీడీపీ మునిగిపోయే నావే అన్న నిర్ణయానికి పలువురు ఎమ్మెల్యేలు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాబట్టి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా.. ఇప్పుడే టీడీపీని వీడి, వైసీపీ తీర్థం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని అనుకున్నా.. సీఎం జగన్ వారికి అహ్వానం పలకలేదు. మరి, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇదిలా ఉంటే.. శాసన సభలో టీడీపీకి ఉన్నది 23 మంది. వీరితోనే సీఎం జగన్ ను చంద్రబాబు ఎదుర్కోలేక పోతున్నారు. తాజా ప్రచారం ప్రకారం ఇందులో ఎంతమంది సైకిల్ దిగుతారో తెలియదు. అప్పుడు పసుపు చొక్కాలు మరింత పలుచనవుతాయి. మరి, ఆ కొద్ది మందితో అధికార పక్షాన్ని ఎదుర్కోగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపు.. బాబు వయసు 70 సంవత్సరాలు. అలాంటి వ్యక్తి, ఫార్టీ ప్లస్ లో ఉన్న జగన్ ను ధీటుగా ఎదుర్కోగలరా అనేది డౌట్. ఇక, అవునన్నా కాదన్నా.. గతంలో మాదిరిగా బాబు నిర్ణయాలు తీసుకోలేరు. అంత దూకుడుగా వ్యవహరించడమూ సాధ్యం కాకపోవచ్చు. రాజకీయంగా ప్రత్యర్థి నుంచి ఎదురయ్యే సవాళ్లు ఓ వైపు, తోటి ఎమ్మెల్యేలకు తనపై విశ్వాసం సన్నగిల్లడం మరో వైపు, వ్యక్తిగతంగా వయోభారం ఇంకో వైపు.. ఈ విధంగా ముప్పేట ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయనే చర్చ ఏపీలో సాగుతోంది. త్వరలోనే ఆయన క్రియాశీల రాజకీయల నుంచి వైదొలిగే అవకాశం ఉందనే చర్చ కూడా మొదలైంది. మరి, ఏం జరగబోతోంది? ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగనున్నారు? రాజకీయాలకు చంద్రబాబు ఎప్పుడు రాజీనామా ప్రకటించబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి.