32 lakh weddings : దాదాపు ఐదారునెలలుగా మంచి మహుూర్తాలు.. మూఢాలతో పెళ్లిళ్లు.. శుభకార్యాలు జరగలేవు. చాలా రోజుల గ్యాప్ తర్వాత నవంబర్ 4 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. జనవరి 14 వరకూ 42 రోజుల పాటు మంచి ముహూర్తాలున్నాయి. ఈ రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు జరుగనున్నాయి.

42 రోజుల్లో దేశవ్యాప్తంగా 32 లక్షల జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ సీజన్ లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షల పెళ్లిళ్లు అవుతాయని అంచనా.. దేశవ్యాప్తంగా ఈ సీజన్ లో దాదాపు రూ.3.75 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగనున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ అల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది.
పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ఇళ్ల మరమ్మతులు, ఇళ్లకు రంగులు వేయడంలో పెద్దఎత్తున వ్యాపారం జరుగుతుంది. ఇది కాకుండా, ఆభరణాలు, చీరలు, లెహంగా-చునీ, ఫర్నిచర్, రెడీమేడ్ దుస్తులు, బట్టలు, పాదరక్షలు, పెళ్లి -గ్రీటింగ్ కార్డులు; డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా వస్తువులు, కిరాణా, ఆహార ధాన్యాలు, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ వస్తువులు, ఎలక్ట్రికల్ యుటిలిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు అనేక బహుమతి వస్తువులు మొదలైనవి సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ లో ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. తద్వారా వీటికి డిమాండ్ ఉంటాయి.కాబట్టి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల వల్ల మంచి వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నారు.
పెళ్లిళ్ల కారణంగా ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, ఓపెన్ లాన్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్‌హౌస్‌లు మరియు వివాహాల కోసం అనేక రకాల స్థలాలకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఫొటోగ్రాఫర్లు , పండితులకు డిమాండ్ వచ్చేసింది. ఈ పెళ్లిళ్ల కారణంగా చాలా మందికి ఉపాధి దొరకనుంది. బోలెడంతా ఖర్చు కానుంది. అందరు వ్యాపారుల పంట పండనుంది.