Jharkhand Minister Banna Gupta: జార్కండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఓ మహిళతో చేసిన వీడియో చాట్ ఒకటి బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది ఎవరో కావాలని చేసిందని.. దీంతో తనకు సంబంధం లేదని.. ఫేక్ వీడియో క్రియేట్ చేసి తనను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని బన్నా గుప్తా చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట త్రిపుర శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పోర్ను వీడియో చూస్తూ మీడియాకు దొరికిపోయారు. అది మరువక ముందే జార్కండ్ లో ఏకంగా ఓ మహిళతో మంత్రి సంభాషిస్తున్న వీడియో దొరకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలకు కారణమవుతోంది. అయితే ప్రజాప్రతినిధులు ఇటువంటి చర్యలకు పాల్పడడం మాత్రం విమర్శలకు దారితీస్తోంది.
బీజేపీ ఎంపీ ట్విట్ తో…
మంత్రి బన్నా గుప్తా మహిళతో వీడియో చాట్ ను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబె తన ట్విట్ లో పోస్టు చేశారు. కీలక కామెంట్స్ ను సైతం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి జతచేస్తే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ మంత్రి బన్నా గుప్తాకు చెందిన సో కాల్డ్ కేసు ఇది. మహిళల గౌరవంతో కాంగ్రెస్ నేతలు ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్త సునీల్ శర్మ తన భార్యను ఓవెన్ లో తగులబెట్టడాన్ని ప్రస్తావించారు. దీనిని గాంధీ కుటుంబం అర్ధం చేసుకోగదలని భావిస్తున్నాను. ఇప్పుడు మంత్రిపై మోపబడిన అభియోగాలు నిజమైతే కాంగ్రెస్ పార్టీ నీటిలో మునిగి చనిపోతుంది’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుస ఘటనలు..
ఇటీవల ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు దిగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికి మొన్న ఏపీలో సైతం ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. ఏకంగా ఓ ఎంపీ న్యూడ్ వీడియో ఒకటి హల్ చల్ చేసింది. కానీ ఆ పార్టీ కనీస దిద్దుబాటు చర్యలకు దిగలేదు. ఆ ఎంపీకే మద్దతు పలికేలా వ్యవహరించింది. అటు త్రిపురలో సైతం బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ ఏకంగా అసెంబ్లీలోనే పోర్ను వీడియోలు చూస్తూ పట్టుబడ్డారు. ఇప్పుడు జార్కండ్ లో ఓ మంత్రి చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి వాటికి బాధ్యులను చేస్తూ నియంత్రించాల్సిన అధినాయకత్వాలు అవి ఫేక్ గా చెబుతున్నాయే కానీ సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడం లేదు.
బాధ్యుడిపై చర్యలకు డిమాండ్..
జార్కండ్ ఇష్యూపై బీజేపీ గట్టిగానే రియాక్టవుతుంది. బాధ్యుడైన మంత్రని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. జార్కండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతూల్ షాదేయో స్పందించారు. తక్షణం మంత్రిని కేబినెట్ నుంచి టెర్మినేట్ చేయాలని కోరారు. ఆ వీడియో నకిలీదని మంత్రి చెబుతున్నారు. అందుకే అందులో నిజం ఎంతో ఉందో నిర్థారణ చేయాల. అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరారు. వీడియోలో వాస్తవం ఉంటే మాత్రం మంత్రిని పదవి నుంచి తొలగించాలని కోరారు. అయితే దీనిపై సీఎం హేమంత్ సోరెన్ కానీ.. కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకూ స్పందించలేదు. మున్ముందు ఇదో రాజకీయ దుమారంగా మారనుంది.
यह है @INCIndia का चरित्र,झारखंड के स्वास्थ्य मंत्री बन्ना गुप्ता जी का यह तथाकथित माजरा है।महिलाओं के इज़्ज़त से खेलना,कॉंग्रेस कार्यकर्ता सुशील शर्मा का अपने पत्नी को तंदूर में जलाना,काश गॉंधी परिवार समझ पाता,यदि यह सही है तो कॉंग्रेस के लिए डूब मरने वाली बात है pic.twitter.com/5Wg3EOcivu
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 23, 2023