HomeజాతీయంRichest MLAs : 20 అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల్లో 12 మంది ఒకే రాష్ట్రం నుంచి......

Richest MLAs : 20 అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల్లో 12 మంది ఒకే రాష్ట్రం నుంచి… ఇదేంది..? 

Richest MLAs : దేశంలో అత్యంత ధనవంతులైన 20 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఒకే రాష్ట్రం.. అదీ దక్షిణాది రాష్ట్రం నుంచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీì ఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(న్యూ) ఇటీవల నివేదిక వెల్లడించింది. 20 మంది ఎమ్మెల్యేల్లో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కెపీసీసీ) అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ రూ.1,413 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. దేశంలోని అత్యంత సంపన్న శాసనసభ్యుల జాబితాలో కర్ణాటక ఎమ్మెల్యేలు ఆధిపత్యం చెలాయించగా, టాప్‌ 20లో 12 మంది ఉన్నారు.
14 శాతం బిలియనీర్లే.. 
కర్ణాటక ఎమ్మెల్యేలలో 14% మంది బిలియనీర్లు (రూ. 100 కోట్లు), దేశంలోనే అత్యధికం, శాసనసభ్యుల సగటు ఆస్తి రూ. 64.3 కోట్లు అని ఏడీఆర్‌ వేదిక చెబుతోంది. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో కర్ణాటక ఎమ్మెల్యేలే ఉన్నారు. రెండో అత్యంత ధనవంతుడు స్వతంత్ర శాసనసభ్యుడు, వ్యాపారవేత్త ఓఏ పుట్టస్వామిగౌడ నిలిచారు. ఈయన ఆస్తి విలువ రూ.1,267 కోట్లు. అప్పులు కేవలం రూ.5 కోట్లు మాత్రమే. మూడవ అత్యంత సంపన్నుడు కర్ణాటక అసెంబ్లీలో అత్యంత పిన్న వయస్కుడైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాకృష్ణ. 39 ఏళ్ల ఆయన ఆస్తులు రూ.1,156 కోట్లుగా ప్రకటించారు.
28 రాష్ట్రాల్లో అఫిడవిట్ల ఆధారంగా.. 
28 రాష్ట్ర అసెంబ్లీలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,001 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను న్యాయవాద బృందం విశ్లేషించింది. 2023 ఎన్నికల సంఘం ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌ ఆధారంగానే ధనవంతుల జాబితా సిద్ధం చేసింది. ఇందులో శివకుమార్‌ తన వద్ద మొత్తం రూ.273 కోట్ల స్థిరాస్తులు, రూ.1,140 కోట్ల చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ఓఏ గౌడకు రూ.990 కోట్ల స్థిరాస్తులు, రూ.276 కోట్ల చరాస్తులు ఉన్నాయి.
అత్యధిక అప్పులున్నది వీరికే..
ఆసక్తికరమైన విషయమేమిటంటే, దేశవ్యాప్తంగా అత్యధికంగా రూ.881 కోట్ల అప్పులు కలిగి ఉన్న శాసనసభ్యుల జాబితాలో ప్రియాకృష్ణ రికార్డు సృష్టించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్‌ నియోజకవర్గానికి చెందిన నిర్మల్‌ కుమార్‌ ధార అత్యంత పేద ఎమ్మెల్యే. ఇతనికి కేవలం రూ. 1,700 ఆస్తి మరియు అప్పులు లేవు. ఇక కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన అత్యంత పేద ఎమ్మెల్యే బీజేపీకి చెందిన భగీరథి మురుళ్య, రూ. 28 లక్షల ఆస్తులు, రూ. 2 లక్షల అప్పులు ప్రకటించారు. ఇక ప్రియాకృష్ణ తండ్రి ఎం.కృష్ణప్ప కర్ణాటకలోని టాప్‌ బిలియనీర్ల జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు. జాబితాలో ఉన్న కర్ణాటకలోని ఇతర ఎమ్మెల్యే మైనింగ్‌ బారన్‌∙గాలి జనార్ధన్‌రెడ్డి సంపన్న ఎమ్మెల్యేల్లో 23వ స్థాంలో ఉన్నాడు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular