Ram Mandir: బిడ్డను కనాలంటే గతంలో పురిటి నొప్పులు వచ్చిన తర్వాతనే ఆస్పత్రులకు వెళ్లేవారు. నొప్పులు మొదలయి వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వైద్యం సాంకేతికంగా అభివృద్ధి చెందడం, మరోవైపు ముహూర్తాలపై విశ్వాసం పెరగడంతో ఇప్పుడు ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేస్తున్నారు డాక్టర్లు. ఇదేంటని అడగితే అయ్యగారు, పండితులు ఇలాగే చేయమని చెప్పారని, ఆ గఢియల్లో పుడితో రాజయోగం పడుతుందని చెబుతున్నారని అంటున్నారు. దీంతో చాలా మంది గర్భిణులు ముహూర్తం చూసుకునే ప్రసవం చేసుకుంటున్నారు.
రామయ్య ఏతెంచే వేళ..
ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా, శ్రీరామ చంద్రుడు అయోధ్యలో అడుగుపెట్టబోతున్నాడు. సీతా సమేతంగా నూతనంగా నిర్మించిన రామాలయంలో కొలువుదీరనున్నారు. ఈమేరకు సోమవారం(జనవరి 22న) ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీతా సమేతంగా రాముడు వస్తున్న శుభ ముహూర్తాన ప్రసవం అయితే రాముడు లేదా సీత తమ ఇంట్లోకి వస్తుందని గర్భిణులు భావిస్తున్నారు.
12 లక్షల ప్రసవాలకు బుకింగ్..
అయోధ్యలో రాముడు అడుగుపెట్టనున్న శుభ ముహూర్తంలో ప్రసవం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది ఇప్పటికే బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 12:15 నుంచి 2 గంటల వరకు ముహూర్తం బాగుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలోనే తమకు ప్రసవం అయ్యేలా చూడాలని గర్భిణులు ఇప్పటికే వైద్యులను సంప్రదించారు. ఈమేరకు అపాయింట్‌మెట్ ఫిక్స్ చేసుకున్నారు.
రాముడో, సీతమ్మో వస్తుందని..
అత్యంత అరుదైన ముహూర్తంలో శ్రీరాముడు సీతాసమేతంగా అడుగుపెడుతున్నాడు. ఈనేపథ్యంలో ఈ ముహూర్తంలో కాన్పు చేయించుకుంటే తమ ఇంటికి శ్రీరాముడో, సీతమ్మో వస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే గర్భిణులు సుముహూర్తం చేసుకోవడం కన్నా, రాముడు అయోధ్యలో కొలువుదీరే వేళ ప్రసవానికి ఆసక్తి చూపుతున్నారు.