Perni Nani: సినిమా టికెట్ల ధరల విషయమై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వివాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. టికెట్స్ ప్రైస్ పెంచడాన్ని తప్పుబడుతూ తాజాగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి పది ప్రశ్నలతో ట్యాగ్ చేశాడు. వర్మ ట్యాగ్ చేసిన ప్రశ్నలతో కూడిన వీడియోకు తాజాగా మంత్రి గట్టిగానే సమాధానమిచ్చాడు. ఆర్జీవీ ట్వీట్స్‌కు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలిపారు. ఇకపోతే సినిమా టికెట్ల ధరల పెంపు విషయమై సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరు స్పందించాలని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
డైరెక్టర్ ఆర్జీవీ మాటలను తాము అస్సలు పట్టించుకోబోమని మంత్రి కొడాలని నాని తెలిపారు. కాగా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని మాత్రం సోషల్ మీడియా వేదికగానే కౌంటర్స్ ఇచ్చాడు. ఆర్జీవీ అడిగిన ప్రతీ ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ రూపంలో ఆన్సర్స్ ఇచ్చాడు. ఆర్జీవీని ఉద్దేశించి ఈ విధంగా ట్వీట్ చేశాడు పేర్ని నాని. ‘మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను.
Also Read: ‘పుష్ప’ 18వ రోజుకు బ్రేక్ ఈవెన్.. ఆల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే !
రూ.100 టికెట్‌ను రూ.1,000 కి, 2,000లకు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకానమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ అండ్ సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?’ అని అడిగాడు. ఈ క్రమంలోనే మరో ట్వీట్లో సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయని చెప్పుకొచ్చారు పేర్ని నాని.
థియేటర్లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. హీరోలకు ప్రొడ్యూసర్స్ ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా ఉందని అన్నారు. అయితే, హీరోకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్స్‌లో టికెట్ల ధరను ఏ రాష్ట్రసర్కారు డిసైడ్ చేయదని ఈ సందర్భంగా మంత్రి నాని వివరించారు.
Also Read: సురేష్ ప్రొడక్షన్స్ కథను గీతా ఆర్ట్స్ కాపీ కొడుతుందా ?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Nani is a staggering counter to rangopal varma
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com