Peddireddy Ramachandra Reddy : వైసీపీలో పెద్దిరెడ్డి ఎందుకు కనిపించడం లేదు?తనకు తాను పార్టీకి దూరమవుతున్నారా? జగన్ దూరం చేశారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీలో పెద్దిరెడ్డి కి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ఏకంగా రాయలసీమనే రాసి ఇచ్చేశారు. గత ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి శాసించారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి సైతం జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఆ ఇద్దరు తండ్రీ కొడుకులు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. వైసీపీలో సైతం యాక్టివిటీస్ తగ్గించారు. అయితే అలా అనేకంటే జగన్ వారికి ప్రాధాన్యం తగ్గించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు పెద్దిరెడ్డి. చాలా నమ్మకంగా ఉండడంతో ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.దానిని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు పెద్దిరెడ్డి. కానీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆ కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి,మరో నియోజకవర్గం నుంచి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కుమారుడు మిథున్ రెడ్డి గెలిచారు.అయితే ఈ ముగ్గురు గెలిచి మిగతావారు ఓడిపోవడంతో వీరిపై అనుమానం ప్రారంభమైంది. అందుకే జగన్ వీరిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
* గత ఐదేళ్లుగా దూకుడు
గత ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా దూకుడుగా ఉండేవారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని కూడా శపధం చేశారు. హిందూపురంలో బాలకృష్ణను గెలవనివ్వకుండా చేస్తానని తేల్చి చెప్పారు.అందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేశారు. జగన్ సైతం తన మంత్రివర్గంలో ఉన్న వారిని తొలగించారు. కానీ పెద్దిరెడ్డి విషయంలో చాలా మినహాయింపులు ఇచ్చారు.మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను మిధున్ రెడ్డి చూశారు. ఇంత ప్రాధాన్యం ఇచ్చినా పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీని గెలిపించుకోలేకపోయింది.తన నమ్మకాన్ని నిలుపుకోక పోవడం వల్లే..పెద్దిరెడ్డి కుటుంబాన్ని జగన్ పక్కన పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.
* సొంత నియోజకవర్గానికి దూరంగా
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత నియోజకవర్గ పుంగనూరు కూడా వెళ్లలేక పోయారు పెద్దిరెడ్డి. దానికి కారణం లేకపోలేదు.పుంగనూరు తో పాటు చిత్తూరు జిల్లాలో తాను ఒక సామంత రాజులా వ్యవహరించారు. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి… రాజకీయాల్లో నష్టాలను తెలిసిన నేతగా ఉండి.. గత ఐదు సంవత్సరాలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఒకవైపు జగన్ పెద్దగా ఆదరించడం లేదు. మరోవైపు కూటమికి టార్గెట్ అయ్యారు. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు నిధులు రెడ్డి సైలెంట్ అయినట్లు తెలుసుకో. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.