Mahavatar Narasimha Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కొన్ని ఇతర భాషల సినిమాలు సైతం తెలుగులో డబ్ అవుతూ మంచి క్రేజ్ ను పాదించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘మహావీర్ నరసింహ’ సినిమా తెలుగులో డబ్ అయింది.అయితే ఈ సినిమాకి తెలుగు జనాలు నీరాజనాలు పడుతున్నారు. యానిమేషన్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది…ఇక ఈ సినిమాని చూడడానికి చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీస్ సైతం ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారాన్ని ఎంచుకొని సినిమాని చేయాలనే ఆలోచన రావడం ఒకెత్తయితే, అది కూడా యానిమేషన్ లో చేయాలని నిశ్చయించుకుని చాలా రిస్క్ చేసి మరి ఈ సినిమాని చేశారు. మొత్తానికైతే ఈ సినిమా సగటు ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో భారీ ఎలివేషన్స్ ఉండడంతో సినిమా చూస్తున్న వాళ్లంతా ఆ సినిమాకి కనెక్ట్ అయిపోతున్నారు.
ఇక కొన్నిచోట్ల సినిమాని చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ బయటే చెప్పులను వదిలేసి వచ్చి మరి సినిమాను చూస్తున్నారంటే ఈ సినిమా జనాల్లో ఎంత భక్తి పారవశ్యాన్ని నెలకొల్పిందో మనం అర్థం చేసుకోవచ్చు… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అనిమేటెడ్ సినిమాలకు కూడా క్రేజ్ అయితే పెరిగింది.
ఇక ఈ దర్శకుడు మహా విష్ణువు అవతారాల్లో మిగిలిన అవతారాలకు సంబంధించిన సినిమాలను కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి యానిమేటెడ్ సినిమాలు గా ప్రేక్షకుల ముందుకు తెచ్చి మన పురాణ కథలను చిన్నపిల్లలకు తెలియజేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
మరి ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటింది. కాబట్టి ఇక మీదట కూడా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా లాంగ్ రన్ 150 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…