Vikram 4th Week Collections: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చి చాలా కాలం అయ్యింది. మరి ముఖ్యంగా.. వరల్డ్ వైడ్ గా కమల్ సినిమాలకు మార్కెట్ ఎప్పుడో తగ్గిపోయింది. కానీ విక్రమ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించడం.. ముఖ్యంగా హీరో సూర్య గెస్ట్ గా కనిపించడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. కమల్ కెరీర్ లోనే భారీ కలెక్షన్ల చిత్రంగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. మరి 4 వీక్స్ కలెక్షన్ల లెక్కలు ఏమిటో తెలుసుకుందాం.
Vikram
నైజాం 7.70 కోట్లు
సీడెడ్ 2.59 కోట్లు
ఉత్తరాంధ్ర 2.79 కోట్లు
ఈస్ట్ 1.52 కోట్లు
వెస్ట్ 1.31 కోట్లు
గుంటూరు 1.59 కోట్లు
కృష్ణా 1.54 కోట్లు
నెల్లూరు 0.75 కోట్లు
Also Read: YCP Politics : జగన్ ను పిలవడానికి వచ్చిన కేంద్ర మాజీ మంత్రికి ఘోర అవమానం..
ఏపీ + తెలంగాణలో మొత్తం 4 వీక్స్ కలెక్షన్స్ గానూ రూ. 19.98 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 39.63 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
‘విక్రమ్’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. అంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ. 7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, 4వ రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి.
నిజానికి తెలుగులో కూడా కమల్ సినిమా మార్కెట్ స్థాయి బాగా తగ్గింది. ఇలాంటి పరిస్థితిలో వచ్చింది కమల్ ‘విక్రమ్’ సినిమా. అందుకే, రిలీజ్ కి ముందు ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. సక్సెస్ రేట్ ఎలాగూ లేదు కాబట్టి.. ఓపెనింగ్స్ రావు అనుకున్నారు. కట్ చేస్తే అద్భుత విజయం సాధించింది.
Also Read: Employees Says Goodbye To Jobs: నచ్చితే చేస్తా.. లేకుంటే పోతాం.. కొలువలకు టాటా చెబుతున్న ఉద్యోగులు!