Jr NTR
Jr NTR: టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊపు ఏ స్థాయి లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..#RRR సినిమాలో కొమురం భీముడొ పాత్ర ద్వారా ఆయన ప్రపంచం లో ఉన్న మూవీ లవర్స్ ని తన అద్భుతమైన నటన తో మంత్రముగ్దులను చేసాడు..గ్లోబల్ వైడ్ ఈ స్థాయి రీచ్ ని సంపాదించిన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చెయ్యబోతున్నాడు అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా ఇటీవలే విడుదల చేసారు..ఈ సినిమా తర్వాత KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు తో ఒక్క సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది..ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
Tarak
Also Read: Vikram 4th Week Collections : కమల్ విక్రమ్ 4 వీక్స్ కలెక్షన్స్ !
అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ అద్భుతంగా డాన్స్ వేస్తాడు ..నటిస్తాడు..పాటలు కూడా పడుతాడు అనే విషయం మన అందరికి తెలుసు..కానీ ఎన్టీఆర్ లో మరో అద్భుతమైన టాలెంట్ కూడా ఉంది..అదే స్క్రిప్ట్ రైటింగ్..ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయనకీ కథలు రాయడం ఒక్క అలవాటు అట..త్వరలోనే ఎన్టీఆర్ తన ఇద్దరి కొడుకుల పేర్ల మీద ఒక నిర్మాణ సంస్థ ని ప్రారంబించబోతున్నాడు..ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఆయన యువ హీరోలను పెట్టి సినిమాలు తియ్యబోతున్నాడట..తాను నిర్మించబోయ్యే సినిమాలన్నిటికీ కూడా కథ ఎన్టీఆర్ మాత్రమే రాస్తాడట..అంతే కాకుండా మొదటి సినిమాకి దర్శకత్వం కూడా వహించబోతున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనున్నారు అట ఎన్టీఆర్..ఇటీవల కాలం లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరియు నాని వంటి హీరోలు సొంతగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారి నితిన్ తో చల్ మోహన్ రంగ అనే సినిమా తీసాడు..అలాగే మహేష్ బాబు ఇటీవలే అడవి శేష్ తో మేజర్ అనే సినిమా తీసి భారీ విజయం ని తన ఖాతాలో వేసుకున్నాడు..అలాగే నాని కూడా ‘హిట్’,’ఆ !’ అనే సినిమాలు నిర్మించి హిట్స్ కొట్టాడు..ఇక రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి ఖైదీ నెంబర్ 150 మరియు సై రా నరసింహ రెడ్డి వంటి భారీ విజయాలు అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇలా హీరోలందరూ నిర్మాతలుగా మారి లాభాలు ఆర్జిస్తున్న సమయం లో ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడవబోతున్నాడు..మరి ఆయన నిర్మాతగా కూడా సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read: Sai Dharam Tej: పవన్ మూవీ షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్