Sai Dharam Tej: వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సెన్సషనల్ హిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయింది..షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవ్వుద్దో తెలియని పరిస్థితి ఏర్పడడం తో ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ మరో సినిమా పూర్తి చెయ్యడానికి సిద్ధం అయ్యాడు..సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్ర పోషించిన వినోదయ్యా సీతం సినిమా లాక్ డౌన్ సమయం లో OTT లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఇమేజి కి తగట్టు మార్పులు చేర్పులు చేసి తెలుగు లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు..ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించబోతుండగా..సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నారు..సముద్రఖని ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎంత డిమాండ్ తో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన లేని కొత్త సినిమా అంటూ ఇప్పుడు ఏమి లేదు అని చెప్పొచ్చు..ఆ స్థాయి డిమాండ్ తో సముద్రఖని కొనసాగుతున్నాడు.

Also Read: YCP Politics : జగన్ ను పిలవడానికి వచ్చిన కేంద్ర మాజీ మంత్రికి ఘోర అవమానం..
కేవలం నటుడిగా మాత్రమే కాదు..డైరెక్టర్ గా కూడా సముద్ర ఖని కి మంచి పేరు ఉంది..తమిళం లో ఇది వరుకు ఆయన తీసిన సినిమాలెన్నో సూపర్ హిట్ గా నిలిచాయి..ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం నటుడిగా తన బిజీ కెరీర్ ని పక్కన పెట్టి వినోదయ్యా సీతం రీమేక్ కి దర్శకత్వం వహించబోతున్నాడు..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు..గతం లో గోపాల గోపాల అనే సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించి అందరిని అలరించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు వినోదయ్యా సీతం రీమేక్ లో కూడా ఆయన పాత్ర ఆ తరహాలోనే ఉంటుంది..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు..ఒరిజినల్ వెర్షన్ లో సాయి ధరమ్ తేజ్ పాత్రకి కారు యాక్సిడెంట్ జరుగుతుంది..ఆ తర్వాత ఆయన చనిపోతాడు..ఇక్కడ సాయి ధరమ్ తేజ్ పాత్ర బైక్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతుందట..యాదృచ్చికం ఏమిటంటే గతం లో సాయి ధరమ్ తేజ్ కి నిజంగానే బైక్ యాక్సిడెంట్ జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కృతి శెట్టి లేదా శ్రీ లీల ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఒరిజినల్ వెర్షన్ కేవలం ఒక్క గంట 30 నిముషాలు మాత్రమే ఉంటుంది..కానీ తెలుగు వెర్షన్ రెండున్నర గంట నిడివి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట..ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై లో రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.

Also Read: Telugu Heroine : ఇండియన్ క్రికెటర్ తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన తెలుగు హీరోయిన్ !

[…] Also Read: Sai Dharam Tej: పవన్ మూవీ షూటింగ్ లో సాయి ధరమ్ త… […]
[…] Also Read: Sai Dharam Tej: పవన్ మూవీ షూటింగ్ లో సాయి ధరమ్ త… […]
[…] Also Read: Sai Dharam Tej: పవన్ మూవీ షూటింగ్ లో సాయి ధరమ్ త… […]