
కొన్ని రోజుల క్రితం చెన్నైలో ఒక పిల్లికి శ్రీమంతం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సైతం అలాంటి ఘటన వైరల్ అవుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు తమకు ఆడబిడ్డ లేకపోవడంతో ఆవునే ఆడబిడ్డగా పెంచుకుంటున్నారు. ఆవు గర్భం దాల్చడంతో ఆ ఆవుకే సీమంతం వేడుక నిర్వహించారు.
Also Read: వెడ్డింగ్ కార్డ్ పై క్యూఆర్ కోడ్.. చదివింపులు నేరుగా ఖాతాలోకి..?
పూర్తి వివరాల్లోకి వెళితే వరంగల్ లోని హన్మకొండలోని పీజేఆర్ అపార్ట్‌మెంట్ లో శోభ, వీరేశం దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం కాగా నలుగురు మగబిడ్డలే కావడం గమనార్హం. అయితే ఆడపిల్ల లేని లోటు మాత్రం ఆ దంపతులను వెంటాడింది. వీరేశానికి ఆవులు అంటే ఎంతో ఇష్టం కాగా నెలరోజుల క్రితం వీరేశం భారీ మొత్తం ఖర్చు చేసి ఒక ఆవును కొనుగోలు చేశాడు.
Also Read: శివుని దర్శించుకునే సమయంలో పాటించాల్సిన నియమాలు.!
అయితే అపార్ట్ మెంట్ లో ఆవును ఉంచడం సాధ్యం కాదు కాబట్టి ఆవు కొరకు కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని వీరేశం దంపతులు ఆవును ప్రేమగా పంచుకుంటున్నారు. ఆవు గర్భం దాల్చగా వీరేశం దంపతులు హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా ఆవుకు సీమంతం చేశారు. గోమాత ఉండే స్థలంలోనే గోవుకు సీమంతం చేశారు. ఆవుకు చీరె, గాజులు, పండ్లు, పసుపు, కుంకుమ పెట్టి సీమంతం వేడుక చేశారు.
మరిన్ని వార్తలు కోసం: వైరల్
రామాలయం పూజారి మధుచారి ఆధ్వర్యంలో సీమంతం వేడుక జరిగింది. స్థానికంగ ఈ ఘటన వైరల్ అవుతుండగా ఆవుకు సీమంతం చేయాలని వీరేశం దంపతులు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.