First Three Days Collections: టాలీవుడ్ లో ఎఫ్3 మూవీ ఇప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా చూసి నవ్వుకోవడానికి వీలుగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. శుక్రవారం విడుదలయ్యే సినిమాలకు శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో ఇప్పుడు వచ్చే కలెక్షన్లే కీలకం. వాటితోనే లాభాలు వచ్చేస్తుంటాయి.ప్రేక్షకులు కూడా వీకెండ్ కు సినిమాలు చూస్తూ కలెక్షన్లకు కారణం అవుతారు.
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గడంతో జనాలు థియేటర్లకు బాగానే వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్3కి ప్రేక్షకాదరణ బాగానే ఉంది. ఇక అంతకుముందు మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాకు తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. మరి ‘ఎఫ్3’, సర్కారువారి పాట చిత్రాల్లో ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి? ఏదీ తోపు అన్నది తెలుసుకుందాం.
Also Read: Caste Politics In Telugu States: ఏపీలో కమ్మ, రెడ్లు.. తెలంగాణలో వెలమ, రెడ్లు.. వేరే నేతలే లేరా?
తాజాగా విడుదలైన ‘ఎఫ్3’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి టాప్ 10లో నిలిచింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 33.53 కోట్లు షేర్ సాధించి నంబర్ 1 గా నిలిచింది. పుష్ప మూవీ మూడు రోజుల్లో రూ.14.38 కోట్లతో రెండోస్థానంలో ఉంది. ఇక భీమ్లానాయక్ మూడు రోజుల్లో 13.51 కోట్లతో మూడో స్థానంలో ఉంది.
ఇక 4వ స్థానంలో మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ ఉంది. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో రూ.12.01 కోట్ల షేర్ సాధించి 4వ స్థానంలో ఉంది. ఇక 5వ స్థానంలో రాధేశ్యామ్, 6వ స్థానంలో వకీల్ సాబ్, 7వ స్థానంలో కేజీఎఫ్2 ఉండగా.. 8వ స్థానంలో ఇటీవల విడుదలైన ‘ఎఫ్3’ మూవీ ఉంది.
ఎఫ్3 మూవీ తొలి మూడు రోజుల్లో రూ.8.85 కోట్ల కలెక్షన్స్ రాబట్టి టాప్ 8లో ఉంది. 9వ స్థానంలో ఉప్పెన, 10వస్థానంలో బంగార్రాజు మూవీ ఉన్నాయి.
Also Read: Allu Arjun Shock To Fans: అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న అల్లు అర్జున్