Brahmastra 15 Days Colletions: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన బ్రహ్మాస్త్ర మూవీ కి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం మొదటి రోజే 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా పోస్ట్ కోవిద్ తర్వాత బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా నిలిచింది..#RRR , KGF చాప్టర్ 2 , పుష్ప, కార్తికేయ 2 ఇలా వరుసగా సౌత్ సినిమాలే రాజ్యం ఏలుతున్న సమయం లో బాలీవుడ్ లో బడా హీరోల సినిమాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలవడం తో ఇక బాలీవుడ్ పని అయిపోయింది..సౌత్ సినెమాలదే హవా అని అందరూ అనుకున్నారు..అలాంటి సమయం లో వచ్చిన బ్రహ్మాస్త్ర చిత్రం బాలీవుడ్ ట్రేడ్ కి కొత్త ఊరట ని కలిగించింది..కానీ అనుకున్న విధంగా ఈ సినిమాకి బలమైన పాజిటివ్ టాక్ వచ్చి ఉంటె కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లో చేరి ఉండేదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

ఇప్పటి వరుకు ఈ సినిమా సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది..తెలుగు లో ఈ సినిమా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ సినిమా బాలీవుడ్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది..అది దాదాపుగా అసాధ్యమేమో అని అనుకుంటున్న సమయం లో నేడు ‘నేషనల్ సినిమా డే’ అవ్వడం బాగా కలిసి వచ్చింది..నేషనల్ సినిమా డే సందర్భంగా ప్రభుత్వం ఈరోజు టికెట్ రేట్స్ ని అన్ని మల్టీప్లెక్స్ మరియు థియేటర్స్ లో కేవలం 75 రూపాయలకు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది..ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అన్ని ముల్టీప్లెక్స్ లు 75 రూపాయలకే టికెట్స్ ని ఆన్లైన్ లో పెట్టింది..ఈ అద్భుతమైన అవకాశాన్ని బ్రహ్మాస్త్ర సినిమా సరిగ్గా ఉపయోగించుకుంది..నూన్ షోస్ నుండే 100 % ఆక్యుపెన్సీలతో కనివిని ఎరుగని రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంది ఈ చిత్రం..ఒక్కమాట లో చెప్పాలంటే ఈ సినిమాకి మొదటి మూడు రోజుల్లో తెగిన టికెట్స్ కేవలం ఈ ఒక్క రోజులోనే తెగాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటి అంటే ఈ సినిమాకి ఈ రోజు దాదాపుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయట..ఇది బాలీవుడ్ హిస్టరీ లోనే చెరిగిపోని రికార్డు గా చెప్పుకోవచ్చు.