https://oktelugu.com/

సరోంగులు అంటే మయన్మార్ సైనికులకు ఎందుకంత భయం..?

ఆగ్నేయాసియాలో నడుముుకు చుట్టుకునే బట్ట..లుంగీ ని సరోంగులు అంటారు. చైనా, మయన్మార్ ప్రాంతాల్లో వాటిని ఇప్పుడు గుండెలపైకి కూడా చుట్టుకుంటారు. పూర్వం మగవాళ్లు మాత్రమే వీటిని చుట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా రకరకాల డిజైన్లతో వస్తున్న సరోంగులను ధరిస్తున్నారు. అయితే సరోంగులను చూసి మయన్మార్ సైనికులు ఎందుకు భయపడుతున్నారు..?మయన్మార్లో ప్రజలు ఇవి ఎందుకు ధరిస్తున్నారు..? సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్ లో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యువతరం రోడ్లపైకి వచ్చి ఈ పాలనను అంతమొందించాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 7, 2021 / 09:17 AM IST
    Follow us on

    ఆగ్నేయాసియాలో నడుముుకు చుట్టుకునే బట్ట..లుంగీ ని సరోంగులు అంటారు. చైనా, మయన్మార్ ప్రాంతాల్లో వాటిని ఇప్పుడు గుండెలపైకి కూడా చుట్టుకుంటారు. పూర్వం మగవాళ్లు మాత్రమే వీటిని చుట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా రకరకాల డిజైన్లతో వస్తున్న సరోంగులను ధరిస్తున్నారు. అయితే సరోంగులను చూసి మయన్మార్ సైనికులు ఎందుకు భయపడుతున్నారు..?మయన్మార్లో ప్రజలు ఇవి ఎందుకు ధరిస్తున్నారు..?

    సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్ లో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యువతరం రోడ్లపైకి వచ్చి ఈ పాలనను అంతమొందించాలని పట్టుబడుతోంది. సైనికులు కూడా సామాన్య ప్రజలని చూడకుండా ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. రాత్రిపూట కరెంట్ కట్ చేయడం.. వీధుల్లో వెంబడించడం.. నుదుటి మీద తుపాకీ పెట్టి కాల్చడం వంటివి సైనికులు చేస్తున్నారు. ఒక్క వారంలో 12 మందికి పై గా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 55 మంది తమ ప్రాణాలను బలిచ్చారు.

    సైనిక పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు, మాంక్స్, మహిళలు, ఉద్యోగలు ఇలా ఒక వర్గం అని కాకుండా దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి రావడంతో సైనిక సైన్యం సహించలేకపోతుంది. కొందరు పోలీసు అధికారులు కూడా ప్రజలకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలను వివిధ రకాల్లో చేస్తున్నారు. చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, ఎత్తైన భవనాల నుంచి సరోంగులను వేలాడదీయడం లాంటివి చేస్తున్నారు. అయితే సరోంగులకు సైనికులు భయపడుతున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు.

    సరోంగులు భవనాలపై వేలాడదీయడం వల్ల సైనికుల్లో ఆద్యాత్మిక శక్తి తగ్గుతుందట. భవనంపైనుంచి వేలాడడం చూస్తే వారి బలం సన్నగిల్లుతుందట. సరోంగుల పట్ల వారికి మూఢ నమ్మకాలున్నాయిని మయన్మార్ కు చెందిన కొందరు మీడియాకు తెలిపారు. ఇక ఇసుక సంచులన్నీ పేర్చి దుర్గంలా ఏర్పాటు చేసుకోవడం, చెత్త బుట్టల్లో నీళ్లు నింపి అడ్డం పెట్టుకోవడం ద్వారా మయన్మార్ ప్రజలు నిరసన తెలుపుతున్నారు. వీరికి చుట్టూ పక్కల వాళ్లు అనేక రకాలుగా సాయం చేస్తున్నారు. అవసరమైన వారికి రక్షణ కవచాలను అందిస్తున్నారు.

    మయన్మార్ విషయంలో ఐక్యరాజ్య సమితి కి చెందిన సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ సంస్థ ‘ఆసియాన్’ఏమాత్రం స్పందించడం లేదని అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారని, సైనిక చర్యలను అడ్డుకోవడానికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పట్టించుకోవడానికి ఇంకెంతమంది మరణించాలి..? అనే ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్నారు.

    యువతరం మాత్రం సైనిక పాలన అంతమొందించేదాకా పోరాడుతామంటున్నారు. దేశ భవిష్యత్తు తమ చేతుల్లో ఉందని వారి భావిస్తున్నారు. అందుకు ఏంత మంది ప్రాణాలు ఇవ్వడానికైనా సరేనని ముందుకు వెళ్తున్నారు. కొందరు తమ కుటుంబసభ్యులకు తెలియడానికి హెల్మెట్ పై బ్లడ్ గ్రూప్, కాంటాక్ట్ నెంబర్ రాస్తున్నారు. మళ్లీ ప్రజాస్వామ్యం వచ్చేదాకా వెనక్కి తగ్గేది లేదంటున్నారు.