లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వారంలో రెండు రోజులు ఇలా చేయాల్సిందే!

మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా గడపాలంటే కచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అయితే అదృష్టం, డబ్బు కలిసి రావాలంటే కొన్నిసార్లు పెద్దలు చెప్పే మాటలను కచ్చితంగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది.వారి చెప్పే మాటలను తూచా తప్పకుండా చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కాగలరు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వారంలో కచ్చితంగా రెండు రోజులు ఇలా చేస్తే తప్పకుండా ఆ ఇంట లక్ష్మీదేవి […]

Written By: Navya, Updated On : December 18, 2020 10:54 am
Follow us on

మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా గడపాలంటే కచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అయితే అదృష్టం, డబ్బు కలిసి రావాలంటే కొన్నిసార్లు పెద్దలు చెప్పే మాటలను కచ్చితంగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది.వారి చెప్పే మాటలను తూచా తప్పకుండా చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కాగలరు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వారంలో కచ్చితంగా రెండు రోజులు ఇలా చేస్తే తప్పకుండా ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు…

Also Read: దేవుడిని ఏ రోజు ఏ పూలతో పూజించాలో మీకు తెలుసా?

ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకొని నిద్ర లేవాలి. అంతేకాకుండా ఉదయం లేచిన వెంటనే మన దొడ్డి గుమ్మం వైపు ఉన్న ద్వారాన్ని తీయటం ద్వారా మన ఇంట్లో ఉన్న దారిద్ర్య లక్ష్మి ఆ ద్వారం గుండా బయటకు వెళుతుంది. తరువాత మన ఇంటి ముందు ద్వారం తెరవాలి.ఇలా తెరిచినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఖచ్చితంగా త్రాగటానికి మంచి నీరు ఇవ్వాలి. అంతే కాకుండా ఎవరైనా ముత్తయిదువులు ఇంటికి వచ్చినప్పుడు వారు వెళ్లేటప్పుడు వారికి ఖచ్చితంగా పసుపు, కుంకుమను ఇవ్వడం ద్వారా మనం ఉన్నత స్థితికి చేరుకుంటామని చెప్పవచ్చు.

Also Read: ఏడుగురిని కాపాడిన రెండున్నరేళ్ల బాలుడు.. ఎలా అంటే..?

ఆ లక్ష్మిదేవికి మంగళవారం, శుక్రవారం ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ తల్లి అనుగ్రహం కలగాలంటే మంగళవారం, శుక్రవారం రోజు మన ఇంటిని శుభ్రపరచుకుని ఐదు ముఖములు గల దీపపు ప్రమిద లో ఐదు వత్తులను వెలిగించి దీపారాధన చేయటం ద్వారా ఆ లక్ష్మీ దేవత సంతోషించి మనకు లక్ష్మీకటాక్షం కలిగిస్తుంది. అయితే ప్రతి వారంలో ఈ రెండు రోజులు ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం