
మనలో చాలామందికి బంగారం కొనుగోలు చేయాలని ఉంటుంది. అయితే రోజురోజుకు బంగారం ధర ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. రోజురోజుకు రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో కనీసం 50,000 రూపాయలు చేతిలో ఉంటే మాత్రం కనీసం 10 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే ఒకేసారి బంగారం కొనుగోలు చేయడం సాధ్యం కాకపోతే పలు స్కీమ్ ల ద్వారా బంగారం కొనవచ్చు.
ప్రముఖ జువెలరీ సంస్థలు సులభ వాయిదాలలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ల కోసం అద్భుతమైన స్కీమ్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ స్కీమ్ ల ద్వారా ప్రతినెలా కొంత మొత్తం చెల్లిస్తూ చివరిలో బంగారాన్ని తీసుకోవడంతో పాటు బంగారంపై తగ్గింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఆన్‌లైన్ ఈజీ బై పేరుతో జువెలరీ సంస్థ జోస్ అలుక్కాస్ 1,000 రూపాయల నుంచి డబ్బులను ఇన్వెస్ట్ చేసే స్కీమ్ ను తెచ్చింది.
ఈ స్కీమ్ తో జోస్ అలుక్కాస్ సంస్థ కస్టమర్లకు ప్రమోషన్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఒక సంవత్సరం పాటు డబ్బులను ప్రతి నెలా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గోల్డెన్ లెవెన్ ఫ్లెక్సీ ప్లాన్ పేరుతో జీఆర్‌టీ జువెలరీ సంస్థ ప్రతి నెలా 500 రూపాయలు చెల్లించి బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ స్కీమ్ లో 11 నెలలు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అదనంగా ఒక నెల డబ్బులను పొంది బంగారం కొనుగోలు చేయవచ్చు.
గోల్డెన్ హార్వెస్ట్ పేరుతో తనిష్క్ సంస్థ సైతం బంగారం స్కీమ్ ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ లో 10 నెలలు 2,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసి 21,500 రూపాయలతో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. తక్కువ ఖర్చుతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఈ స్కీమ్స్ ప్రయోజనకరంగా ఉంటాయి.