కొట్టుకున్న వైసీపీ నేతలు.. ‘ఆమంచి’ని పరిగెత్తించారు

అధికార వైసీపీలో ఉండి ఇలా వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న వైనం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి చేస్తూ ముందుకు పోతుంటే వైసీపీలోని వ్యతిరేక బ్యాచులు బహిరంగంగా కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది.వైసీపీ ఎంపీ మోపిదేవి సాక్షిగా వైసీపీ నేతలు బట్టలు చింపుకోవడం దుమారం రేపింది.. Also Read: ఏపీ హైకోర్టు సీజేను సిక్కింకు మార్చుతున్నారా? ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి […]

Written By: NARESH, Updated On : December 15, 2020 8:23 pm
Follow us on

అధికార వైసీపీలో ఉండి ఇలా వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న వైనం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి చేస్తూ ముందుకు పోతుంటే వైసీపీలోని వ్యతిరేక బ్యాచులు బహిరంగంగా కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది.వైసీపీ ఎంపీ మోపిదేవి సాక్షిగా వైసీపీ నేతలు బట్టలు చింపుకోవడం దుమారం రేపింది..

Also Read: ఏపీ హైకోర్టు సీజేను సిక్కింకు మార్చుతున్నారా?

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల పరస్పర దాడులతో చీరాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురికి గాయాలయ్యాయి.

వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ల పర్యటన సందర్భంగా ఆమంచి, కరణం వర్గాలు కొట్టుకున్నారు. పర్యటన సందర్భంగా కాన్వాయ్‌లో ఒకరి వాహనాలను ఒకరు అధిగమించేందుకు బలరాం, కృష్ణమోహన్‌ అనుచరులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొందరు వాహనాల బయట నిలబడి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదే గొడవకు కారణమైంది. ప్రసాదనగరం దాటిన తర్వాత ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అది పెద్దదై దాడుల వరకు వెళ్లింది.

Also Read: సీఎంపై అసంతృప్తి గళం విప్పుతున్న నేతలు..!

ఈ దాడులకు మాజీ ఎమ్మెల్యే ఆమంచియే కారణమని మహిళలు , మత్య్సకారులు నిలదీశారు. ఆయనను పరిగెత్తించి దాడి చేయడానికి పూనుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరామర్శకు వచ్చి గ్యాంగ్ లతో రెచ్చగొడుతావా అని ఆమంచిని మహిళలు నిలదీశారు. ఇలా అధికార వైసీపీలో వర్గవిభేదాలు రచ్చ కెక్కాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్