https://oktelugu.com/

Texas Abortion Law: శృంగారం బంద్.. ఆ దేశంలో మహిళల సమ్మె

Texas Abortion Law: ప్రపంచంలో చాలా రకాలైన సమ్మెలు జరిగాయి, జరుగుతున్నాయి వాటని చూస్తున్నాం. అయ్యో అనుకుంటాం. కానీ సెక్స్ సమ్మె జరగడం ఇదే తొలిసారి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సమ్మెను అందరు విచిత్రంగా చూస్తున్నారు. ఇటీవల టెక్సాస్ లో ప్రభుత్వం కొత్త అబార్షన్ చట్టం (Abortion Law) ప్రవేశ పెట్టింది. దీంతో మహిళల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వారు పురుషులతో సంభోగం ఆపాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీనికి ప్రముఖ నటి, గాయని […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 7, 2021 1:10 pm
    Follow us on

    Texas Abortion LawTexas Abortion Law: ప్రపంచంలో చాలా రకాలైన సమ్మెలు జరిగాయి, జరుగుతున్నాయి వాటని చూస్తున్నాం. అయ్యో అనుకుంటాం. కానీ సెక్స్ సమ్మె జరగడం ఇదే తొలిసారి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సమ్మెను అందరు విచిత్రంగా చూస్తున్నారు. ఇటీవల టెక్సాస్ లో ప్రభుత్వం కొత్త అబార్షన్ చట్టం (Abortion Law) ప్రవేశ పెట్టింది. దీంతో మహిళల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వారు పురుషులతో సంభోగం ఆపాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీనికి ప్రముఖ నటి, గాయని బెట్టే మిడ్లర్ మహిళలకు అండగా ఉన్నారు. దీంతో దేశంలో సెక్స్ సమ్మె పిలుపు అందుకుని అందరు వీధులకెక్కారు.

    టెక్సాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బెట్టే ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. మహిళలంతా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆడవారు పురుషులతో సెక్స్ లో పాల్గొనరాదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. గర్భం దాల్చాలా వద్దా అనేది మహిళ హక్కని దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదని పేర్కొన్నారు. ఇష్టం లేకున్నా పిల్లలను కనాలని చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ట్విటర్ వేదికగా ఆమె తన ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు సెక్స్ లో పాల్గొనరాదని సూచించింది.

    గర్భం దాల్చిన మహిళలకు ఆరు వారాల పాటు ప్రెగ్నెంట్ అయిన విషయం తెలియదని అన్నారు. కానీ ప్రభుత్వం గర్భం పోగొట్టుకోవడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం దారుణమని వాపోయింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. మహిళల నుంచి సానుకూల స్పందన రావడంతో సెక్స్ సమ్మె ఆగదని పిలుపునిచ్చారు. మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో వారు సమ్మె కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.

    టెక్సాస్ ప్రభుత్వం అబార్షన్ చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో నిరసన వ్యక్తమవుతోంది. టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన అబార్షన్ హక్కుల తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉందని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల హక్కులకు భంగం కలిగించే ఈ చట్టంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని అప్పట్టో సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

    కొత్తగా తీసుకొచ్చిన అబార్షన్ చట్టంతో మహిళలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇదివరకు ఆరు వారాల గర్భం తరువాత పిండాన్ని తొలగించుకునే వీలుండేది. కానీ ఈ చట్టంతో పిండాన్ని తొలగించే ముందు వైద్యుల పరీక్షల తరువాతే చేయించుకోవాలి. దీంతో మహిళల రక్షణకు భంగం కలిగించే విధంగా ఉన్న చట్టాన్ని తొలగించాల్సిందేనని చెబుతున్నారు. అయితే అత్యాచారం, అక్రమ సంబంధాల వల్ల కలిగే గర్భాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొనడంతో విమర్శలు పెరుగుతున్నాయి.