BiggBoss Telugu 5: బిగ్ బాస్ లోకి ట్రాన్స్ జెండర్.. జబర్ధస్త్ లో చేసిన అతడు ఎవరు, బ్యాక్ గ్రౌండ్?

BiggBoss Telugu 5: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా మొదలైంది. సీజన్ ను హోస్ట్ హీరో నాగార్జున ఘనంగా లాంచ్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ కలర్ ఫుల్ గా సాగింది. టీవీ వీక్షకులను కట్టిపడేసింది. కరోనా వేళ ఈసారి మధ్యలో పంపే అవకాశం లేకపోవడంతో ఏకంగా 19మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. ఇంత మందిని ఎప్పుడూ పంపిన దాఖలాలు లేవు. వేర్వేరు రంగాలకు చెందిన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ […]

Written By: NARESH, Updated On : September 9, 2021 1:11 pm
Follow us on

BiggBoss Telugu 5: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా మొదలైంది. సీజన్ ను హోస్ట్ హీరో నాగార్జున ఘనంగా లాంచ్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ కలర్ ఫుల్ గా సాగింది. టీవీ వీక్షకులను కట్టిపడేసింది. కరోనా వేళ ఈసారి మధ్యలో పంపే అవకాశం లేకపోవడంతో ఏకంగా 19మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. ఇంత మందిని ఎప్పుడూ పంపిన దాఖలాలు లేవు. వేర్వేరు రంగాలకు చెందిన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ మొత్తం కోలాహలంగా మారింది.

ఒక్కొక్కరూ ఒక్కో రంగం నుంచి వచ్చి బిగ్ బాస్ ఇంట్లో సందడి చేశారు. బిగ్ విజేత కోసం పోటీపడుతున్నారు. వీరిలో అందరిలోకి క్రేజ్ ఉన్న వారు ఎవరంటే యాంకర్ రవితోపాటు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. ఇక పోయిన సారి లాగానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ ను ప్రవేశపెట్టారు. ఆమె పేరు ‘ప్రియాంక సింగ్’. తొమ్మిదో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

ప్రియాంక సింగ్ ఒక ట్రాన్స్ జెండర్. అసలు పేరు సాయితేజ. అతడు మగాడిగా పుట్టి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. జబర్ధస్త్ లో లేడి వేశాలు వేశాడు. బుల్లితెరపై సెటిల్ అయ్యారు. బిగ్ బాస్ స్టేజీ మీదకు వచ్చాక ప్రియాంక భావోద్వేగానికి గురయ్యాడు. తాను లింగమార్పిడి చేయించుకోవడాన్ని తండ్రి ఇంకా అంగీకరించలేదని.. మిగతా కుటుంబ సభ్యులందరూ తనను మహిళగా ఒప్పుకున్నారని ప్రియాంక సింగ్ చెప్పారు. తాను ఎందుకు సెక్స్ రీఅసైన్ మెంట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించారు. సమాజానికి భయపడి ఎందరో ట్రాన్స్ జెండర్లు జీవిస్తున్నారని. వారికి స్ఫూర్తిగా నిలవాలనే తన లక్ష్యం అని బిగ్ బాస్ తో నెరవేరుతుందని అన్నారు.

హోస్ట్ నాగార్జున కూడా ప్రియాంకను ప్రశంసించాడు. మనిషికి స్వేచ్ఛనివ్వాలని.. వారు ఎలా జీవించాలన్నది వారి ఇష్టం అని.. వారికి ప్రోత్సాహాన్ని అందివ్వాలని విజ్ఞప్తి చేశాడు.