https://oktelugu.com/

Vizag Antarvedi: విశాఖ, అంతర్వేది సముద్రంలో కలిసిపోతుందా..? ఐపీసీపీ ఏం చెబుతోంది..?

Vizag Antarvedi: సముద్ర తీరం వెంబడి వెళ్తుంటే ఒక్కోసారి భీకరంగా వచ్చే అలలు భయపెడుతాయి. అలా అలలు రావడంతో మనం మునిగిపోతామా..? అనే భయం కలుగుతుంది. ఇక ఎప్పటికీ అలాగే వస్తే సముద్రం భూమిని ముంచేస్తుందా..? అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే సముద్రం భూమిని ముంచడమేంటి..? అలలు అక్కడి వరకే వచ్చి రిటర్న్ పోతాయి కదా? అని కొందరు చెబుతుంటారు. కానీ తీరాన్ని ముంచేసేలా సంద్రం తరుముకొస్తోందన్నది ఇప్పుడు అదే నిజం కాబోతుందట.. సముద్రం భూమిని లాగేసుకుంటుందట..! […]

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2021 / 11:24 AM IST
    Follow us on

    Vizag Antarvedi: సముద్ర తీరం వెంబడి వెళ్తుంటే ఒక్కోసారి భీకరంగా వచ్చే అలలు భయపెడుతాయి. అలా అలలు రావడంతో మనం మునిగిపోతామా..? అనే భయం కలుగుతుంది. ఇక ఎప్పటికీ అలాగే వస్తే సముద్రం భూమిని ముంచేస్తుందా..? అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే సముద్రం భూమిని ముంచడమేంటి..? అలలు అక్కడి వరకే వచ్చి రిటర్న్ పోతాయి కదా? అని కొందరు చెబుతుంటారు. కానీ తీరాన్ని ముంచేసేలా సంద్రం తరుముకొస్తోందన్నది ఇప్పుడు అదే నిజం కాబోతుందట.. సముద్రం భూమిని లాగేసుకుంటుందట..! రానున్న రోజుల్లో సముద్ర తీరం వెంబడి ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయని ఇటీవల ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీపీ) తాజా నివేదికలో పేర్కొంది. మరో 80 ఏళ్లల్లో సమద్రపు నీరు పెరగనుందని…ఏపీలోని విశాఖ(Vizag), అంతర్వేది(Antarvedi) జలసమాధి అయిపోతుందని సంచలన ప్రకటన చేసింది.

    ఐపీసీసీ రిపోర్టు ప్రకారం.. రానున్న 80 ఏళ్లల్లో భారతదేశంలోని 12 తీరప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగనుంది. కనిష్టంగా 0.16 మీట్లరు…గరిష్టంగా 0.82 మీటర్ల వరకు పెరుగుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మాజీ రీజనల్ హెడ్ డాక్టర్ జీపీఎస్ మూర్తి తెలిపారు. 2100 నాటికి తీర ప్రాంతాలైన విశాఖతో పాటు కాండ్లా, కొచ్చి, చెన్నై, ఓఖా, బావ్ నగర్, మంగళూర్, ఖదిర్ పుర్, తూత్తుకుడి, మోర్ముగావ్ లు మునిగిపోతాయని పేర్కొంది. అయితే ఈ రిపోర్టును స్టడీ చేసేందుకు నాసా ప్రొజెక్షన్ టూల్ ను రూపొందించింది. దీని ప్రకారం విశాఖలో 0.54, మంగళూరు 0.57, చెన్నై 0.57 మేరకు సముద్ర మట్టం పెరుగుతుందని తెలిపింది.

    వాతావరణంలో వస్తున్న మార్పులను ఆధారంగా చేసుకొని 1988లోనే యునైటేడ్ నేషన్స్ ఎన్విరానమెంటల్ ప్రొగ్రాం, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ లు సంయుక్తంగా చర్చించాయి. మనిషి జీవిన విధానం ప్రపంచాన్నికాపాడుకునే విధంగా లేవని తెలిపాయి. తాజాగా ఉష్ణోగ్రతలో పెరుగుదలతో మంచుకొండలు కరిగిపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఐపీసీసీ అంచానాలు వేసినట్లుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఉష్ణోగ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. ఈ కారణంగా సముద్ర మట్టాల్లో నీరు పెరుగుతోంది.

    ఇదిలా ఉండగా కర్భన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు ఇలా ఏటేటా పెరిగితే 20150 నాటికి గరిష్టంగా 5 మీటర్ల వరకు సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉందని ఐపీసీసీ రిపోర్టులో పేర్కొంది. అవి కచ్చితమైన గణాంకాలు కానప్పటికీ కాలుష్యాన్ని కంట్రోల్ చేయకపోతే జరిగేది అదేనని తెలిపింది. అంతర్జాతీయంగా సముద్ర మట్టాలు ఏడాదికి3.7 మీటర్లు పెరుగుతుందని 2018లో జరిపిన ఒక సర్వేలో వెల్లడైంది. ఇది ప్రమాదమేనంటున్నారు.

    ఏపీలోని విశాఖవాసులకు ఐపీసీసీ రిపోర్టు గురించి తెలియకపోయినా చాలా ఏళ్ల నుంచి చూస్తే సముద్ర మట్టం పెరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. 50 ఏళ్ల కిందట తీర ప్రాంతాల్లో ఆటస్థలం ఉండేదని, అక్కడ తాము ఆడుకేనేవారమని.. కానీ ఇప్పుడు రోడ్డు మాత్రమే మిగిలిందని స్థానికుడు తెలిపారు. విశాఖ హార్బర్ నుంచి భీమిలి వరకు 32 కిలోమీటరల్ల పోడవైన తీర ప్రాంతం ఉంది. ఇందులో ఆర్కే బీచ్, సబ్ మెరైన్ ఏరియా, వుడా పార్క్, భీమిలీ తీరాల్లో సముద్రం ముందుకు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడమంటే ఐసీసీ రిపోర్డు చెప్పిన ప్రకారం కాదని భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

    మరోవైపు ఐపీసీసీ పేర్కొన్న విధంగా భారత్ లోని తీరప్రాంతాలకు భయం అక్కర్లేదని ఆంధ్రా యూనివర్సిటీ కి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. భారత్లోని తీర ప్రాంత నగరాలు సురక్షితంగానే ఉన్నాయంటున్నారు. విశాఖ నగరం సముద్ర మట్టం కంటే రెండు మీటర్ల వరకు ఎత్తులో ఉందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి తూర్పు కనుమలు రక్షణగా ఉంటాయన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేదిలో ఎప్పుడూ సముద్రం అలజడిగానే కనిపిస్తుంది. అక్కడ సముద్రం అలల ధాటికి తీర ప్రాంతాల్లో ఉన్న భవనాలు కుప్పకూలాయి. సముద్రంలో ఏ చిన్న అలజడి జరిగినా ఈ ప్రాంతపై పడుతుందని అంటున్నారు. అంతర్వేదితోపాటు భీమిలి, కాకినాడ, విశాఖలోని కొన్ని లోతట్లు ప్రాంతాలు సముద్ర అలజడికి ప్రభావితమవుతాయని అంటున్నారు.