ముందుగా ‘101 జిల్లాల అందగాడు..’ అవసరాల శ్రీనివాస్ హీరోగా వస్తోన్న సినిమా ఇది. బట్టతలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఈ టాలెంటెడ్ యాక్టర్ రెడీ అయ్యాడు. సెప్టెంబరు 3న థియేటర్‌లలో విడుదల కానున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.
ఇక మరో సినిమా ‘డియర్ మేఘ’. మేఘా ఆకాష్, అరుణ్ అదిత్ హీరోహీరోయిన్లుగా అర్జున్ సోమయాజుల కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన సినిమా అంటూ మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు గానీ, సినిమాలో మ్యాటర్ ఉన్నట్టు కనిపించడం లేదు. కాబట్టి.. సినిమా నిలబడటం కష్టమే. కాకపోతే 300 థియేటర్లలో సెప్టెంబరు 3న ఈ చిత్రం విడుదల కానుంది.
‘అప్పుడు ఇప్పుడు’ అంటూ ఒక చిన్న సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం వృధా. సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల తెరకెక్కించిన ఈ చిత్రం కూడా సెప్టెంబరు 3న థియేటర్ లలో రిలీజ్ అవుతుంది.
‘కిల్లర్’ అంటూ మరో చిన్న సినిమా కూడా రేసులో ఉంది. కార్తీక్ సాయి, డాలీ షా, నేహా దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా వస్తోన్న ఈ చిత్రం గురించి ఎవరికి తెలియదు. కాబట్టి, కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడం అనవసరం.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9 : యాక్షన్ ప్రియులకు ఇష్టమైన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా అలరించే చిత్రాల్లో ఈ సిరీస్ కూడా ఒకటి సెప్టెంబరు 3న ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.