జాబ్ క్యాలెండర్ మళ్లీ ఉంటుందా..?: సీఎం సిగ్నల్స్

జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగమైన జాబ్ క్యాలెండర్ ను ఇటీవల ప్రకటించారు. అయితే దీనిపై నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందరు. అందులో భారీస్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో పాటు అన్ని శాఖల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్న అపవాదు ఎదురైంది. దీంతో కొన్ని చోట్ల నిరుద్యోగులు నిరసన కూడా తెలిపారు. ఇదే అదనుగా ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకొని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై పునరాలోచిస్తున్నట్లు సమాచారం.అంటే జాబ్ క్యాలెండర్ […]

Written By: NARESH, Updated On : July 27, 2021 10:43 am
Follow us on

జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగమైన జాబ్ క్యాలెండర్ ను ఇటీవల ప్రకటించారు. అయితే దీనిపై నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందరు. అందులో భారీస్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో పాటు అన్ని శాఖల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్న అపవాదు ఎదురైంది. దీంతో కొన్ని చోట్ల నిరుద్యోగులు నిరసన కూడా తెలిపారు. ఇదే అదనుగా ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకొని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై పునరాలోచిస్తున్నట్లు సమాచారం.అంటే జాబ్ క్యాలెండర్ ను మరోసారి జగన్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు అసంతృప్తి చెందినట్లు తెలసింది. దీనిపై ప్రభుత్వం పునరాలోచిస్తుందని వ్యాఖ్యలు చేశారు. దీంతో దీనిపై మరోసారి చర్చించి మరిన్ని ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నిరుద్యోగులు నుంచి వస్తున్న నిరసన తీవ్రంగా కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించినా నిరుద్యోగులు ఎప్పటి నుంచి నిరాశతో ఉన్నారు. దీంతో అవకాశం వచ్చినప్పుడల్లా వారు తమ నిరసనను తెలియజేస్తున్నారు. దీంతో ప్రజా సంక్షేమమే లక్ష్యంతా తమ ప్రభుత్వ పనిచేస్తుందని జగన్ జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు.అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు ఈ నోటిఫికేషన్ చూసిన తరువాత తీవ్ర నిరాశ చెందారు. ఇందులో పెద్ద ఎత్తున్న ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో చాలా మంది ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు.

ఇప్పటికే నోటిఫికేషన్లు రాక నిరాశతో ఉన్న వారు జాబ్ క్యాలెండర్లో ఉన్న ఉద్యోగాలు చూసి మరింత ఆందోళన చెందారు. ఇక ఈ జాబ్ క్యాలెండర్ మాకొద్దు అంటూ రోడ్డుపైకి వచ్చారు. వీరికి ప్రతిపక్షాలు కూడా తోడవడంతో రోజురోజుకు మరింత ఆందోళనలు పెరిగాయి. దీనిని మరింత పెద్దగా చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించింది. జాబ్ క్యాలెండర్లో మరిన్ని మార్పులు చేసి ప్రకటిస్తామని నిర్ణయించుకున్నట్లు సమాచారం.