https://oktelugu.com/

గ్రేటర్ లో పవన్ అందుకే ప్రచారం చేయలేదా?

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ముందుగా ఆ పార్టీ అధినేత పవన్ ప్రకటించారు. తరువాత బీజేపీ నేతల ఒత్తిడితో దానిని విరమించుకుని, బీజేపీకి పవన్ మద్దతు తెలిపారు. ఈనెల 28, 29 తేదీలలో పవన్ రోడ్ షో ఉంటుందని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే అంతకు ముందు నుంచి ఊహించినట్లుగానే , గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరంగా ఉన్నారు. ఒకవైపు గ్రేటర్ లో కేంద్ర బీజేపీ పెద్దలు, మంత్రులు ,జాతీయ స్థాయి నాయకులు, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 03:15 PM IST
    Follow us on

    గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ముందుగా ఆ పార్టీ అధినేత పవన్ ప్రకటించారు. తరువాత బీజేపీ నేతల ఒత్తిడితో దానిని విరమించుకుని, బీజేపీకి పవన్ మద్దతు తెలిపారు. ఈనెల 28, 29 తేదీలలో పవన్ రోడ్ షో ఉంటుందని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే అంతకు ముందు నుంచి ఊహించినట్లుగానే , గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరంగా ఉన్నారు. ఒకవైపు గ్రేటర్ లో కేంద్ర బీజేపీ పెద్దలు, మంత్రులు ,జాతీయ స్థాయి నాయకులు, ఇలా ఎంతోమంది హైదరాబాద్ లో అడుగు పెట్టినా, పవన్ మాత్రం ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడం, ఇంటికే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: హైదరాబాద్ లో రోహింగ్యాల వేట మొదలైంది..

    గ్రేటర్ లో పవన్ రోడ్ షో నిర్వహిస్తారు అని అంత అంచనా వేయగా, పవన్ మాత్రం ఆ సాహసం చేయలదు. ఈ ప్రచారం వల్ల రానున్న రోజుల్లో ఎన్నో తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే గ్రేటర్ ఫలితాలలో తేడా వస్తే తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మరోవైపు సినిమాలలో యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో అనవసర తలనొప్పులు కంటే మౌనంగా ఉండడమే బెటర్ అన్న అభిప్రాయంతో పవన్ సైలెంట్ అయిపోయినట్టుగా తెలుస్తోంది.

    పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని పవన్ గొప్పగా ప్రకటించారు. అలాగే జనసైనికులతో పాటు తన అభిమానులను బీజేపి విజయానికి పాటుపడాలంటు పిలుపిచ్చారు. సీన్ కట్ చేస్తే పోటీనుండి విత్ డ్రా అవ్వగానే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుండి పిలుపు వచ్చింది. దాంతో అర్జంటుగా నాదెండ్ల మనోహర్ ను తీసుకుని పవన్ ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ మూడు రోజులు ఖాళీగా కూర్చుని చివరకు ఉత్త చేతులతో హైదరాబాద్ కు వచ్చేశారు. ఇక ప్రచారానికి ఉన్నది ఆదివారం ఒక్కరోజే.

    Also Read: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

    హైదరాబాద్ కు వచ్చేసి కూడా మూడు రోజులవుతోంది. అయినా గ్రేటర్ ప్రచారంలో పవన్ ఎక్కడా కనిపించలేదు. అంటే ఇటు పోటీ నుండే కాకుండా అటు ప్రచారానికి కూడా పవన్ను బీజేపీ నేతలు దూరం పెట్టేశారా ? అనే అనుమానం పెరిగిపోతోంది. నిజానికి పవన్ ప్రచారం చేసినంత మాత్రన ఎంతమంది ఓట్లేస్తారనేది డౌటే. పైగా సీమంధ్ర పార్టీ అనే అంశంతో టీఆర్ఎస్ రెచ్చిపోయే అవకాశం ఉందని కూడా కమలంనేతలు అనుమానించారట.

    అందుకే కోరి తమంతట తాముగా కేసీయార్ కు అవకాశం ఎందుకివ్వాలన్న ఆలోచనతోనే గ్రేటర్ ప్రచారంలో పవన్ను దూరం పెట్టేసినట్లు బీజేపీ వర్గాల సమాచారం. లేకపోతే తెలంగాణాతో ఏవిధంగాను సంబంధం లేని ప్రకాష్ జవదేకర్, స్మృతీ ఇరానీ, జేపీ నడ్డా, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్