https://oktelugu.com/

మయన్మార్ లో ఫేస్ బుక్ అక్కడి సైనిక ప్రభుత్వానికి ఎందుకు భయపెడుతోంది?

సోషల్ మీడియాల్లో ప్రధానమైనది ఫేస్ బుక్. ప్రపంచంలో ఏ మూలనైనా సరే జరిగిన సంఘటనను పేస్భుక్ ద్వారా తెలుసుకునే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఖాతాలు కలిగి ఉన్నవారు రకరకాల మెసేజ్ లు, పోస్టులు పెడుతుంటారు. ప్రభుత్వాలు సైతం ఫేస్ బుక్ ద్వారా కొన్ని ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ఈ ఫేస్ బుక్ మయన్మార్ దేశంలో అత్యధికంగా వాడుతున్నారని సర్వేల్లో తేలింది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే చివరిగా ఈ దేశంలోకి ఫేస్ బుక్ వచ్చింది. కానీ ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 6, 2021 4:27 pm
    Follow us on

    Myanmar People

    సోషల్ మీడియాల్లో ప్రధానమైనది ఫేస్ బుక్. ప్రపంచంలో ఏ మూలనైనా సరే జరిగిన సంఘటనను పేస్భుక్ ద్వారా తెలుసుకునే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఖాతాలు కలిగి ఉన్నవారు రకరకాల మెసేజ్ లు, పోస్టులు పెడుతుంటారు. ప్రభుత్వాలు సైతం ఫేస్ బుక్ ద్వారా కొన్ని ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ఈ ఫేస్ బుక్ మయన్మార్ దేశంలో అత్యధికంగా వాడుతున్నారని సర్వేల్లో తేలింది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే చివరిగా ఈ దేశంలోకి ఫేస్ బుక్ వచ్చింది. కానీ ఇప్పుడు అదే వారి ప్రాణపదమైంది. ఇది ఒక బలమైన ప్రచార సాధనం అని తెలుసుకున్న ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఫేస్ బుక్ ను తప్ప మరొక మీడియాను నమ్మడం లేదట.

    Also Read: సాగు చట్టాల వివాదం.. రైతులను అనలేక.. విదేశీమద్దతుదారులపై దాడులా..?

    ఇటీవల మయన్మార్ ప్రభుత్వాన్ని సైనికాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశం మళ్లీ సైనిక పాలనలోకి పోయింది. సైన్యాధికారి నియంతలా పాలిస్తున్నారు. ఇప్పుడు ఆ సైనిక పాలకులను ఫేస్ బుక్ భయపెడుతోందట.. సైనిక అధికారులు ఫేస్ బుక్ అంటే మాత్రం తెగ భయపడిపోతున్నారట. ప్రభుత్వాధికారులను తమ నిర్బంధంలోకి తెచ్చుకున్న సైనికాధికారులు ఫేస్ బుక్ కు ఎందుకు భయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం..

    2000 సంవత్సరంలో మయన్మార్ ప్రజలకు ఫేస్ బుక్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడి వారికి సెల్ ఫోన్ గురించి కూడా ఐడియా లేదు. కానీ 2011 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణల ద్వారా ఐటీ రంగానికి ఇక్కడి ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. దీంతో 2014లో నార్వేకు చెందిన టెలీనార్, ఖతార్ కు చెందిన ఓరీడూలు మయన్మార్ లో టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఒక్కసారిగా మయన్మార్ ప్రజలకు మైబైల్ అలవాటుగా మారింది. 2010 నుంచి ఫేస్ బుక్ వాడితే ఎలాంటి డేటా ఖర్చు లేదని తెలుపడంతో దీనిని విచ్చల విడిగా వాడడం మొదలు పెట్టారు. ఇప్పడు దేశవ్యాప్తంగా 5.4 కోట్ల మంది జనాభా ఫేస్ బుక్ ఖాతాను కలిగి ఉన్నారు.

    ఫేస్ బుక్ మంచితో పాటు చెడు కూడా చేస్తోందని మయన్మార్ ప్రజలు లేటుగానే తెలుసుకున్నారు. అందులో వాస్తవాలు, అవాస్తవాలు గ్రహించలేకపోయారు. ఈ నేపథ్యంలో 2014లో ఆసిన్ విరాతు అనే బౌద్ధ భిక్షువు, ఒక ముస్లిం వ్యక్తి బౌద్ధ మతానికి చెందిన యువతిని అత్యాచారం చేశాడంటూ ఓ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ వీడియో ద్వారా మత ఘర్షణలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఇద్దరు మరణించారు. అయితే ఆ తరువాత అది ఫేక్ వీడియో అని గుర్తించారు.

    Also Read: ‘ఉక్కు’ద్రవం మొదలైంది

    ఈ ఘటన తరువాత ఫేస్ బుక్ మిలిటరీ అధికారులను, ద్వేష పూరితగా కామెంట్లు పెట్టేవారిని తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించింది. ప్రస్తుత మిలిటరీ పాలకుడు మిన్ ఆంగ్ హ్లయింగ్ ను కూడా ఫేస్ బుక్ నుంచి 2018లో తొలగించింది. ఆర్మీకి చెందిన టెలివిజన్ చానెల్ ‘మ్యా వాడీ’ని తన ఫ్లాట్ ఫాం మీద కనిపించకుండా చేసింది.

    ప్రస్తుతం మయన్మార్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలంతా ఫేస్ బుక్ ద్వారా మిలటరీ పాలనను ఎలుగెత్తి చాటుతున్నారు. వేల పోస్టులు హ్యాష్ ట్యాగ్ లతో సైనిక పాలకుల నియంతరాజ్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇదో పెద్ద ఉద్యమంలాగా ఆ దేశంలో తయారైంది. దీంతో సైనిక పాలకులు ఇప్పుడు ‘ఫేస్ బుక్’ అంటే హడలి చస్తున్నారు. వెంటనే వాటిని నియంత్రించాలని ఫేస్ బుక్ కు ఆదేశాలు జారీ చేసింది. మిలటరీ తిరుగుబాటుతో ఫేస్ బుక్ కుడా అప్రమత్తమైంది. మిలటరీకి మద్దతుగా పోస్టులు పెట్టేవారిని తొలగిస్తున్నామని ముందే ప్రకటించింది ఫేస్ బుక్. దీంతో ప్రజలు ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు.

    కానీ కోవిడ్-19 ఇతర సమాచారం కోసం ఫేస్ బుక్ అవసరం ఏర్పడిన తరుణంలో కొందరి ఖాతాలు బ్లాక్ చేయడం తగదని ఆందోళన చేస్తున్నారు. ‘ఫేస్ బుక్ ఖాతాలను బ్లాక్ చేయడమంటే ప్రజల భావప్రకటా స్వేచ్ఛను, సమాచార హక్కును అడ్డుకోవడమే’ అని మయన్మార్ మేధావులు అంటున్నారు. అయితే మొత్తంగా ఫేస్ బుక్ సైనిక పాలకులకు భయపడి తన ప్రజలను దూరం చేసుకుంటుందా..? అంటే కాదంటున్నారు. దేశంలో పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఎప్పటిలాగా పునరుద్ధరిస్తామని ఫేస్ బుక్ అధికారులు అంటున్నారు.